English   

భ‌య‌పెడుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్.. 

NTRs-Biopic
2018-11-27 20:08:25

అదేంటి.. భ‌యం ఎందుకు అనుకుంటున్నారా..? ఒక్క‌సారి చూడండి.. ఎలా మొద‌లైంది.. ఎలా మారిపోతుంది.. రేపు విడుద‌ల నాటికి ఇంకెలా మార‌బోతుంది..? అస‌లు ఊహించ‌డానికి కూడా వీల్లేని భారీగా మారిపోతుంది ఎన్టీఆర్ బ‌యోపిక్. అన్న‌గారి కోసం ఇండ‌స్ట్రీ అంతా క‌లిసొస్తుంది. మ‌హాన‌టిలోనే అంత మంది న‌టుల‌ను చూసి ఔరా అనుకున్న వాళ్ల‌కు ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఏకంగా షాక్ ఇస్తుంది. ఒక్క‌టి రెండు మూడు అంటూ చాలా మంది ఇందులో వ‌చ్చి చేరుతూనే ఉన్నారు. ఇప్పుడు జ‌య‌ప్ర‌ద‌గా హ‌న్సిక‌.. జ‌య‌సుధ‌గా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించ‌బోతున్నారు. అస‌లు క్రిష్ ఒక్క సినిమాలో ఇంత‌మందిని ఎలా చూపించ‌బోతున్నాడు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్టీఆర్ పై అభిమానంతో అంతా ఒక్క‌టై ఈ చిత్రం చేస్తున్నారు. ఇది ఆయ‌న‌కు ఘ‌న నివాళిగా మార‌బోతుంద‌నేది అర్థ‌మైపోతుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, చంద్రబాబునాయుడుగా రానా, హరికృష్ణగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌, సావిత్రిగా నిత్యా మీనన్‌, ఏఎన్నార్‌గా సుమంత్‌ నటిస్తున్నారు. ఇప్పుడు పాయ‌ల్, హ‌న్సిక కూడా తోడ‌య్యారు. అంతే కాదు.. స‌మంత కూడా ఓ పాత్ర కోసం తీసుకుంటున్నారు అనేది వినిపిస్తున్న వార్త‌. మ‌రి ఆమెను ఏ పాత్ర కోసం తీసుకుంటున్నార‌నేది చూడాలి. ఏదేమైనా ఇంత‌మంది మేటి న‌టుల క‌ల‌యికలో వ‌స్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు.. 24న మ‌హానాయ‌కుడు విడుద‌ల కానున్నాయి. 
 

More Related Stories