English   

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఎంత ముంచేసారో తెలుసా..? 

Amar-Akbar-Anthony
2018-11-27 20:57:57

ర‌వితేజ సినిమా అంటే ఒక‌ప్పుడు క‌నీసం మినిమ‌మ్ గ్యారెంటీ అనే ముద్ర ఉండేది. సినిమా క‌థ ఎలా ఉన్నా కామెడీ ఉంటుంద‌నే న‌మ్మ‌క‌మైనా ఉండేది ప్రేక్ష‌కుల్లో. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఈయ‌న సినిమా వ‌స్తుందంటే ఎందుకులే ఏముండ‌దు అక్క‌డ అంటూ లైట్ తీసుకుంటున్నారు ప్రేక్ష‌కులు. దీన్ని నిజం చేస్తూ ఈ మ‌ధ్యే వ‌చ్చిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కూడా అటు నిర్మాత‌లు.. ఇటు బ‌య్య‌ర్ల‌ను దారుణంగా ముంచేసింది. ఈ సినిమా వల్ల మైత్రి మూవీ మేకర్స్ కు దాదాపు పాతిక కోట్ల దాకా నష్టం వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. విడుద‌ల‌కు ముందే ర‌వితేజ‌, శీనువైట్ల పేరు చెప్పుకుని అమెజాన్ ప్రైమ్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ అమ్మినా కూడా వాళ్లు కోడ్ చేసిన మొత్తం రాకపోవడంతో న‌ష్టం అయితే వ‌చ్చింది. ఇందులో ఒక్క రవితేజకే రెమ్యునరేషన్ రూపంలో పది కోట్లకు పైగా ఇచ్చార‌ని తెలుస్తుంది. అలాంటిది ఈ చిత్రం ఫుల్ ర‌న్ క‌నీసం ఆయ‌న తీసుకున్న మొత్తం కూడా రాక‌పోవ‌డంతో నిర్మాత‌ల‌కు ఏం చేయాలో.. డిస్ట్రిబ్యూటర్లు ఎక్క‌డ త‌ల బాదుకోవాలో అర్థం కాని ప‌రిస్థితి. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీకి రెండు వారాల ముందు మైత్రి నుంచి వ‌చ్చిన‌ సవ్యసాచి కూడా డిజాస్ట‌రే. దానికోసం దీన్ని త‌క్కువ రేట్ల‌కు ఇస్తే ఇది అంత‌కంటే త‌క్కువ వ‌సూలు చేసి ఇప్పుడు మ‌ళ్లీ మైత్రి మూవీ మేక‌ర్స్ కు న‌ష్టం తెచ్చింది. న‌మ్మిన శీనువైట్ల అయితే న‌ట్టేటా ముంచేసాడు. ఇప్పుడు ఈయ‌న‌కు రావాల్సిన మిగిలిన అమౌంట్ కూడా ఆపేసారు మైత్రి మూవీ మేక‌ర్స్. ప్ర‌స్తుతం మైత్రి మూవీ మేక‌ర్స్ సాయిధ‌ర‌మ్ తేజ్ తో చిత్రలహరి సినిమా చేస్తున్నారు. దాంతో పాటే విజ‌య్ దేవ‌ర‌కొండతో డియ‌ర్ కామ్రేడ్ నిర్మిస్తున్నారు. మ‌రి ఈ చిత్రాలైనా మైత్రిని ఫ్లాపుల్లోంచి బ‌య‌ట‌ప‌డేస్తాయో లేదో చూడాలి. 

More Related Stories