English   

షారుక్ సినిమాలో శ్రీ‌దేవి.. ఫ్యాన్స్ కు స‌ర్ ప్రైజ్.. 

Shah-Rukh-Khan
2018-11-28 11:46:25

అదేంటి.. చ‌నిపోయిన శ్రీ‌దేవిని ఎలా తీసుకొస్తున్నారు.. మ‌ళ్లీ గ్రాఫిక్స్ వాడుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారా..? అదేం లేదు నిజంగానే శ్రీ‌దేవి ఇప్పుడు జీరో సినిమా ఉంది. ఆమె బ‌తికి ఉన్న‌పుడే అప్ప‌ట్లో శ్రీ‌దేవితో చిన్న పాట ఒక‌టి చేయించారు ఈ చిత్రంలో. అయితే ఈ విష‌యాన్ని స‌ర్ ప్రైజ్ గా ఉంచాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విడుద‌ల టైమ్ కు శ్రీ‌దేవిని తీసుకొచ్చి ప్ర‌మోష‌న్ చేయించాల‌నుకున్నాడు షారుక్ ఖాన్. కానీ ఏం చేస్తాం.. ఈ టైమ్ కు ఆమె లోకంలోనే లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు ఆమె ఉన్న‌దే మ‌హ‌ద్భాగ్యం అంటూ ఇప్పుడు అదే ప్ర‌మోష‌న్ లో వాడుకోడానికి చూస్తున్నారు. అస‌లు జీరో సినిమాలో శ్రీ‌దేవి ఉంద‌నే విష‌య‌మే చాలా మందికి తెలియ‌దు. అయితే బాలీవుడ్ లో ఇలాంటి కామ‌న్. ఓ సినిమాలో మ‌రో స్టార్ అలా క‌నిపించి మాయం కావ‌డం అనేది ప్ర‌తీసారి జ‌రుగుతుంటుంది. 

జీరోలో స‌ల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. ట్యూబ్ లైట్ లో షారుక్ ఖాన్ ఉన్నాడు. అలాగే శ్రీ‌దేవి కూడా ఉంది. ఓ పాట కోసం ఈమె త‌ళుక్కున మెరిసి మాయం కానుంది. దాంతో ఇప్పుడు షారుక్ ఖాన్ అభిమాన‌లే కాదు శ్రీ‌దేవి అభిమానులు కూడా ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు. త‌మ అభిమాన తార‌ను మ‌రోసారి స్క్రీన్ పై చూడాల‌ని ఆస‌క్తిగా చూస్తున్నారు. శ్రీ‌దేవి త‌న జీవితంలో కెమెరాను ఫేస్ చేసిన చివ‌రిక్ష‌ణాలు ఇవే కావ‌డం విశేషం. దాంతో జీరో సినిమాలో ఆమెను చూస్తున్న‌పుడు ఫ్యాన్స్ ఎమోష‌నల్ కావ‌డం ఖాయం. ఇదే సినిమాకు కూడా ప‌నికొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు కింగ్ ఖాన్. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది జీరో. మ‌రి శ్రీ‌దేవి అప్పియ‌రెన్స్ అయినా షారుక్ ఖాన్ ను వ‌ర‌స ఫ్లాపుల్లోంచి బ‌య‌ట‌ప‌డేస్తుందో లేదో చూడాలి. 

More Related Stories