English   

అఖిల్ క్లారిటీ ఇచ్చాడండోయ్.. 

Akhil
2018-11-28 17:55:31

అఖిల్ ఒక‌ప్ప‌ట్లా లేడు.. ఇప్పుడు చాలా మారిపోయాడు. త‌న సినిమాల గురించి త‌నే అప్ డేట్స్ ఇస్తున్నాడు. బాధ్య‌త తీసుకుంటున్నాడు.. ఏ సినిమా ఎప్పుడు వ‌స్తుంది.. ఎలా ఉంది.. ఎంత‌వ‌ర‌కు పూర్త‌యింది అంటూ ట్విట్ట‌ర్ లో అప్ డేట్స్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అఖిల్. ఈయ‌న న‌టిస్తున్న మిస్ట‌ర్ మ‌జ్ను షూటింగ్ అంతా పూర్త‌యింది.. కేవ‌లం ప్యాచ్ వర్క్ మాత్ర‌మే ఉంద‌ని.. అది కూడా వేగంగా జరుగుతుందని.. డిసెంబర్ 3 ఒక్క పాట‌ మినహా షూటింగ్ అంతా పూర్తవుతుందని చెప్పాడు అఖిల్. జనవరి లో విడుదల చేయనున్నామని.. ఈ విషయంలో ఓపికగా ఉన్న అభిమానులకు నా ధన్యవాదాలని అఖిల్ ట్వీట్ చేసాడు.

అఖిల్ ఇందులో ప్లే బాయ్ గా న‌టిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు టాకీ ఫినిష్ చేసుకుంది. ఇంకో పాట మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌యింది. అవి కూడా డిసెంబ‌ర్ 3 లోపే పూర్త‌వుతుంద‌ని అఖిల్ చెప్పాడు. డిసెంబ‌ర్ 21న విడుద‌ల అనుకున్నా కూడా అప్పుడు అంత‌రిక్షం.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. యాత్ర లాంటి సినిమాలు వ‌స్తున్నాయి. దాంతో వాటితో పోటీ ఎందుకు అని అఖిల్ సైలెంట్ గా సైడ్ ఇస్తున్నాడు. పైగా గ‌తేడాది డిసెంబ‌ర్లో వ‌చ్చిన హ‌లో పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే జ‌న‌వ‌రిలో సినిమా విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నాడు అఖిల్. ముందు ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి త‌న‌కు క‌లిసొచ్చిన ఫిబ్ర‌వరిలో ప్లాన్ చేసాడు కానీ ఇప్పుడు జ‌న‌వ‌రికి ప్రీ పోన్ అయింది. మ‌రి చిన‌బాబు ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories