English   

దిల్ రాజుది ఓవర్ కాన్ఫిడెన్సా.. లేక..?

Dil-Raju
2018-11-28 19:13:54

దిల్ రాజు.. నో డౌట్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్. మంచి కథలు సెలెక్ట్ చేయడంలో దిల్ రాజుది స్పెషల్ స్టైల్. కానీ ఈ స్టైల్ ఈ మధ్య అడ్డం తిరిగింది. తను బాగా నమ్మిన కథలన్నీ విపరీతంగా నిరాశపరుస్తున్నాయి. అందుకు కారణం.. అతను ట్రెండ్ లోకి రాకపోవడమే. ఒకప్పుడు తనకు హిట్ ఇచ్చిన కథల్నేఇప్పటికీ నమ్ముతుండటమే. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ పెద్దగా హ్యాపీగా లేడు. ఈ టైమ్ లో ఇంకాస్త జాగ్రత్తగ అడుగులు వేయాలి. కానీ అతను మళ్లీ పాత ప్రయత్నాన్నే చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ విషయంలో ఇప్పటికే దిల్ రాజును చాలామంది వారించారు. వారందరి మాటలను పక్కన బెట్టి తనో వారియర్ లా ఆ కథతోనే సినిమా అంటూ పట్టుబడుతున్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు మహేష్ బాబు మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. అదే టైమ్ లో తనకు విపరీతంగా నచ్చిన తమిళ్ సినిమా ‘‘96’’ను రీమేక్ చేసే పనిలోనూ ఉన్నాడు. ఈ సినిమా తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 హార్ట్ బ్రేకింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తెలుగులో చేయడం కోసం కనీసం తమిళ్ వెర్షన్ కూడా ఇక్కడ విడుదల కానివ్వలేదు. దీంతో ఇప్పటికే 96 ను డిజిటల్ స్ట్రీమింగ్ లో చూశారు. అందరికీ నచ్చింది. కానీ  ఎటొచ్చీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందనేదే ప్రశ్న. 

నిజానికి 96 వంటి కథలకు మనకు చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు ప్రేమించుకుని విడిపోయిన జంట కథలు చాలానే చూశాం. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్’లోని హై స్కూల్ లవ్ స్టోరీనే ఈ సినిమా. అలాగే రీసెంట్ గా వచ్చిన ‘మళ్లీ రావా’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. అలాంటప్పుడు అదే పాయింట్ తో ఉన్న తమిళ్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందనేది ప్రశ్న. ఈ కారణంగానే కథ నచ్చినా.. నాని, శర్వానంద్ వంటి హీరోలు వెనకడుగు వేస్తున్నారు. 

కానీ దిల్ రాజు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తానంటూ పట్టుబడుతున్నాడు. మొదట్లో త్రిషనే చేయమన్నాడు. ఆమె నో చెప్పింది. ప్రస్తుతం సమంత కోసం ట్రై చేస్తున్నాడు. కానీ సమంత మాత్రం త్రిషను ఎవరూ మరిపించలేరు అంటూ మెల్లగా తప్పుకుంది. మొత్తంగా ఒక్కోసారి మనకు బాగా నచ్చిన సినిమాలు ప్రేక్షకులకు అస్సలు నచ్చవు. ఈ విషయంలోనూ మనకు అనేక ఉదాహరణలున్నాయి.  అయినా ఈ కథపై దిల్ రాజుకు ఎందుకంత గురి ఉందో తెలియదు కానీ.. అతనిదో కాన్ఫిడెన్సో, ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదంటున్నారు చాలామంది. 

More Related Stories