English   

సి.బి.ఐ ఆఫసర్ గా వెన్నెల కిశోర్

Vennela-Kishore
2018-11-28 19:57:49

అనుకోకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ వెన్నెల కిశోర్. అనుకోకుండా వచ్చిన వెన్నెల నే ఇంటిపేరుగానూ మార్చుకున్నాడు. అయితే మనోడికి ఎక్కడో సుడి ఉంది. ఆ సుడి అతన్ని తెలుగు సినిమా సముద్రంలో గిర్రున తిప్ప స్టార్ కమెడియన్ గా ఓ ఒడ్డుకు చేర్చింది. హీరో వేషాలు గట్రా వేయకుండా హ్యాపీగా కమెడియన్ గా అందరు దర్శక నిర్మాతలకు కంఫర్టబుల్ గా మారాడు వెన్నెల కిశోర్. ఇప్పటికే తన కామెడీతో ఎన్నో సినిమాలను నిలబెట్టాడు కూడా. అయితే అతన్లో మంచి నటుడు కూడా ఉన్నట్టు చాలా సినిమాల్లో చూశాం. కానీ ఎవరూ ఆ వైపుగా అతన్ని ప్రోత్సహించినట్టు కనిపించదు. కానీ సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ పసిగట్టాడు. అందుకే అతనికి తన సినిమాలో ఓ పెద్ద పాత్ర ఆఫర్ చేశాడు. 

1995లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ భారతీయుడుకు ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాడు శంకర్. కమల్ హాసనే మళ్లీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో మళయాల యంగ్ స్టర్ దుల్కర్ సాల్మన్ తో పాటు తమిళ్ స్టార్ శింబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమా ఆసాంతం కనిపించే ఓ ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్ ను తీసుకున్నాడు శంకర్. ఈ విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగించినా.. అతను ఎంచుకున్నది మంచి నటుడిని కాబట్టి పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. 

అయితే ఈ సినిమాలో వెన్నెల కిశోర్  సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. కామెడీ కూడా చేసినా అంతకు మించి అతని పాత్ర సెటిల్డ్ గా ఉంటుందని సమాచారం. భారతీయుడులో సిబిఐ ఆఫీసర్ గా నటించిన నెడిముడి వేణుకు ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు కదా.. ఈ మూవీలో అతను కూడా ఉంటాడు. అయితే ఓ సీనియర్ ఆఫీసర్ గా ఈ కేస్ కు సంబంధించిన డీటెయిల్స్ ను అందిస్తుంటాడట. ఆ డీటెయిల్స్ ను డీటెయిల్డ్ గా కలెక్ట్  చేసిన తన ఆఫీస్ కు ఇచ్చే పని వెన్నెల కిశోర్ ది అంటున్నారు. ఏదేమైనా ఈ పాత్ర క్లిక్ అయితే ఇకపై కిశోర్ కోసం మరో కోణం నుంచి కథలు రాసుకుంటారేమో మన దర్శకులు. 

More Related Stories