English   

మళ్లీ నల్లనయ్యతో మిల్కీ బ్యూటీ 

Tamannaah
2018-11-29 18:34:20

విశాల్.. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్నవాడు. రియల్ హీరోగానూ తిరుగులేని పేరు తెచ్చుకున్న విశాల్.. ఇప్పుడు వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. ఒకప్పుడు రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో విసిగించిన ఈ నల్లనయ్య.. కొన్నాళ్ల క్రితం రూట్ మార్చాడు. మంచి కథలను డిటెక్ట్ చేస్తూ.. అభిమన్యుడులా బాక్సాఫీస్ వ్యూహంలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన అతని 25వ సినిమా సండాకోళై-2(పందెకోండి -2)కాస్త నిరాశపరిచినా ఈ స్సీడ్ ఆగడం లేదు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన ‘టెంపర్’ రీమేక్ ‘అయోగ్య’లో నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక లేటెస్ట్ గా మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు విశాల్. ఇందులో ఈ నల్లనయ్య సరసన తెల్లని బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి కత్తి సండై అనే సినిమాలో యాక్ట్ చేశారు. కొంత గ్యాప్ వచ్చినా సెకండ్ టైమ్ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కోసం టై అప్ అయ్యారు. అన్నట్టు ఈ సినిమాకు దర్శకుడు సుందర్ సి. యాక్షన్ ఎంటర్టైనర్స్ ను అందించడంలో సుందర్ స్పెషలిస్ట్.. ఇంతకు ముందు విశాల్, సుందర్ కాంబినేషన్ లో మదగజరాజా, అంబల అనే సినిమాలు వచ్చాయి. కానీ వీటిలో మొదటిదివిడుదల కాలేదు. రెండోది పెద్దగా ఆడలేదు. దీంతో ఈ మూవీతో మంచి హిట్ కొట్టి తమ కాంబినేషన్ పై ఉన్న బ్యాడ్ నేమ్ ను పోగొట్టుకోవాలనుకుంటున్నాడు సుందర్ సి. మొత్తంగా చేతిలో సినిమాల్లేవు అనుకుంటోన్న టైమ్ లో తమన్నాకు వచ్చిన ఈ ఛాన్స్ తనకు మరికొన్ని సినిమాలు తెచ్చిపెడుతుందనడంలో డౌటే లేదు. పైగా అమ్మడికి కోలీవుడ్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. 

More Related Stories