English   

ఆ హీరోల్లా బిల్డప్ ఇవ్వను:  బెల్లంకొండ శ్రీనివాస్

Kavacham
2018-11-29 19:01:02

కుర్రాడికి మేటర్ తెలిసొచ్చిందో లేక క్యారెక్టర్ కోసం అలా పాడేశాడేమో కానీ.. లేటెస్ట్ గా బెల్లకొండ శ్రీనివాస్ సినిమాకు సంబంధించిన ఓ పాట వింటే మాత్రం భలే ఉంది. సినిమాలో ఎలా ఉంటుందో కానీ.. వింటుంటే ఇది గతంలో ఇలాంటి పాటలు చేసిన చాలామంది స్టార్ హీరోలపై సెటైర్ వేసినట్టుగా మాత్రం అనిపిస్తోంది. నిజం.. పాట లిరికే అలా ఉంది. నిజానికి ఒకప్పుడు మన స్టార్ హీరోల ఎంట్రీ సాంగ్స్ వింటే ఎంత సిల్లీగా ఉండేవో చెప్పక్కర్లేదు. వీలైతే ఉపదేశాలివ్వడం.. లేదంటే ఉద్భోధలు చేయడం.. కుదిరితే వంశాల పేర్లు చెప్పుకుని ఉప్పొంగిపోవడం.. అభిమానులు ఫ్యామిలీ అనీ.. అంతా నా వాళ్లే అనీ ఇలా ఏవేవో ఉండేవి ఆ లిరిక్స్  లో.. ఆయా హీరోల ఇమేజ్ ను బట్టి ఉండే ఆ పాటలపై బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో గట్టి సెటైరే వేస్తున్నారు.

 

బెల్లకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా కవచం. ఈ డిసెంబర్ 7న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో మొదటి లైన్స్ సెటైరికల్ గా ఉన్నాయి.. ‘‘ నా అడుగే పడితే అణుయుద్ధం.. మొదలవుతుంది అనునిత్యం.. అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో.. నే చిటికే వేస్తే భూగోళం వెళ్లిపోతుంది పాతాళం అని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో’’.. అంటూ సాగుతాయీ లిరిక్స్.. తమన్ సంగీతం అందించిన ఈ పాట ఎప్పట్లానే చాలాసార్లు విన్నట్టుగా ఉన్నా.. కాస్త ఆకట్టుకునేలానే ఉంది. విశేషం ఏంటంటే గతంలో హీరోలను తెగ పొగుడుతూ పాటలు రాసిన చంద్రబోసే ఈ పాటను రాయడం.. మొత్తంగా శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతోన్న ఈ మూవీ డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. 

శ్రీనివాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్య విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ మూవీతో శ్రీనివాస్ ఎలాంటి రిజల్ట్ చూస్తాడో చూడాలి. 

More Related Stories