English   

ఒక సినిమాకు రెండు షాకులు

Nannu-Dochukunduvate
2018-11-29 19:50:32

అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ అనే మాట ఇండస్ట్రీలో ప్రతి వారం ఏదో ఒక నిర్మాత అనుకుంటూనే ఉంటాడు. లేదంటే ప్రేక్షకులైనా ఫీలవుతుంటారు. అంచనాలు అందుకోలేకపోవడమో.. అతి నమ్మకం కొంప ముంచడమో ఇక్కడ వెరీ కామన్. అలాంటి కామన్ పాయింట్ లో పడిపోయిన సుధీర్ బాబు ఒకే సినిమాకు రెండు సార్లు లాస్ అయ్యాడు పాపం. అయితే తను హీరోగా చేస్తే ఒకదాంతో పోయేది.. నిర్మాత కూడా కావడంతో లేటెస్ట్ గా సెకండ్ షాక్ తిన్నాడు. సుధీర్ బాబు తొలిసారిగా నిర్మాణ రంగంలోకి తెరకెక్కించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ట్రైలర్ తోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి బిజినెస్ కూడా జరిగింది. దీంతో శాటిలైట్స్ కూడా భారీగానే వచ్చాయి(అతని మార్కెట్ రేంజ్ తో పోలిస్తే). అయితే ట్రైలర్ కు పాజిటివ్ టాక్, మంచి బిజినెస్ డీల్స్.. ఇవన్నీ చూసి సుధీర్ కు నమ్మకం డబుల్ అయింది. అందుకే శాటిలైట్ రేట్ గా రెండు కోట్లు అని వచ్చిన మార్కెట్ ను కాదన్నాడు. ఎందుకంటే అతను రెండు కోట్ల కంటే ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేశాడు. కట్ చేస్తే సినిమా విడుదలైంది. 

నన్ను దోచుకుందువటే సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఎవరూ సినిమా బాలేదు అని చెప్పలేదు. పైగా మంచి అప్రిసియేషన్స్ కూడా వచ్చాయి. దీంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ ఇక్కడే కలెక్షన్స్ అడ్డం తిరిగాయి. హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు. ఆశ్చర్యంగా ఈ ప్రేక్షకులతో పాటు విమర్శలు కూడా మెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో రెండు కోట్లు శాటిలైట్ మార్కెట్ దగ్గరకు వెళ్లాడు సుధీర్ బాబు. కానీ మేటర్ తెలిసిన వాళ్లు ఇప్పుడు వాళ్లు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇస్తా అన్నారట. మరి ఇంకా లేట్ చేస్తే అది కూడా రాదనుకున్నాడేమో.. సుధీర్ ఆ కోటికే శాటిలైట్ రైట్స్ అమ్మేశాడట. పాపం.. అప్పుడే ఇచ్చి ఉంటే ఇంకో కోటి వచ్చి ఉండేది కదా.. 

More Related Stories