English   

అల్లు అర్జున్ కొత్త కుంపటి ఇదే

Allu-Arjun
2018-11-29 20:12:14

స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న దేశముదురు మనోడు. అందుకే తనకంటూ సొంతంగా ఓ కుంపటి పెట్టుకన్నాడు. ఇప్పటి వరకూ గీతా ఆర్ట్స్ అంటే అల్లు వారందరిదీ. ఇకపై గీత నుంచి తనకంటూ ఓ కొత్త గీత గీసుకున్నాడు బన్నీ. ‘ఏఏ’ అంటూ ‘అల్లు ఆర్ట్స్’ లేదా ‘‘అర్జున్ ఆర్ట్స్’’ అనే అర్థం వచ్చేలా.. లేదంటే ‘‘అల్లు అర్జున్’’ అనే మీనింగ్ ధ్వనించేలా ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాడని చాలాకాలంగా వినిపిస్తున్నదే. అది నిజమేనంటూ ఇదుగో ఇప్పుడు ఆ బ్యానర్ కింద ఓ కొత్త ఆఫీస్ కూడా తీసుకున్నాడు. ఆ ఆఫీస్ రెనోవేషన్ కూడా పూర్తయింది. అందుకే ఇలా స్టైలిష్ ‘‘తన ఆఫీస్’’లో నించుని ఫోజులిచ్చాడు అర్జున్. ఏదేమైనా గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో కొత్త బ్యానర్ రావడం ఆహ్వానించదగిందే. కాకపోతే ఇందులోనూ అల్లు అరవింద్ ప్రమేయం, పర్యవేక్షణ ఉంటుందా లేక కేవలం బన్నీ లేదా బన్నీ వాసే అన్నీ చూసుకుంటారా అనేది తెలియాలి. 

ఇక కొత్త సినిమా విషయంలో పాత కన్ఫ్యూజన్ నే కంటిన్యూ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ ఇయర్ చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తో కాస్త గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. అయితే ఈ గ్యాప్ ను కరెక్ట్ గా వాడుకున్నాడు. అదే ఇది. అంటే కొత్తగా తనకంటూ ఓ ఆఫీస్ కట్టుకున్నాడన్నమాట. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తాడు అనే మాటలు మాటలుగానే ఆగిపోయాయి తప్ప.. అవేవీ ప్రొడక్షన్ వరకూ కాదు కదా.. కనీసం ప్రీ ప్రొడక్షన్ అయినా జరుగుతుందా అనేదీ తెలియడం లేదు. మొత్తంగా సినిమా చేయడం లేదు కానీ.. సినిమాలు నిర్మించేందుకు కొత్త ఆఫీస్ తో సరికొత్త బిజీనెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అల్లు అర్జున్. 

More Related Stories