English   

క‌లెక్ష‌న్ల వేట మొద‌లైంది.. రికార్డులే.. 

Rajinikanth-2.0
2018-11-30 11:47:25

అనుకున్న‌ట్లుగానే ర‌జినీకాంత్ వేట‌ మ‌ళ్లీ మొద‌లుపెట్టాడు. ఈయ‌న న‌టించిన 2.0 ఇప్పుడు సంచ‌ల‌న క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతుంది. స‌ర్కార్ రికార్డులు మూన్నాళ్ల ముచ్చ‌టగానే మిగిలిపోయాయి. అంతా ముందునుంచి ఊహించిన‌ట్లుగానే ఇప్పుడు చెన్నైలో తొలిరోజే 2.64 కోట్లు వ‌సూలు చేసి.. స‌ర్కార్ పేరు మీదున్న 2.37 కోట్ల రికార్డును తుడిచేసాడు 2.0. దూకుడు చూస్తుంటే ఈజీగా అక్క‌డ బాహుబ‌లి 2 రికార్డులు కూడా బ‌ద్ద‌లు అయిపోయేలా క‌నిపిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఊహించిన స్థాయిలో వ‌సూళ్లు రావ‌డం లేదు. ఇక్క‌డ తొలిరోజే 15 కోట్ల షేర్ వ‌స్తుంది అని ఊహించారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు ప‌రిస్తితి చూస్తుంటే 12 కోట్ల షేర్ కూడా వ‌చ్చిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. అదే కానీ జ‌రిగితే 2.0 కు ఇక్క‌డ చాలా క‌ష్టం అయిపోతుంది. 

ఎందుకంటే తెలుగులో 85 కోట్లు బిజినెస్ చేసింది ఈ చిత్రం. త‌మిళ‌నాట అంటే ర‌జినీకాంత్, శంక‌ర్ ఉన్నారు కాబ‌ట్టి వాళ్ల పేరుతో వ‌స్తుంది కానీ తెలుగులో అలా కాదు. ఇప్పుడు ర‌జినీ సినిమాలు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు మ‌నోళ్లు. దానికితోడు 2.0లో క‌థ లేకుండా కేవ‌లం విజువ‌ల్స్ మాత్ర‌మే ఉన్నాయి. దాంతో లాంగ్ ర‌న్ క‌ష్ట‌మ‌వుతుందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఓపెనింగ్స్ వ‌ర‌కు అయితే ప‌ర్లేదు కానీ ఆ త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి అనేది అర్థం కావ‌డం లేదు. తొలిరోజే ఓవ‌రాల్ గా 100 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌చ్చింది. అందులో తెలుగులో 20 కోట్లు.. త‌మిళ‌నాట 40 కోట్ల వ‌ర‌కు గ్రాస్ ఉంది. మిగిలిన చోట్ల కూడా తొలిరోజు కుమ్మేసింది 2.0. మ‌రి చూడాలి.. రానురాను ఇదే జోరు కొన‌సాగిస్తుందో లేదో..? 

More Related Stories