English   

అఖిల్ త‌ర్వాత సినిమా ఏంటి.. ఎవ‌రితో..?

Akhil-PS-Mitran
2018-11-30 11:53:50

అఖిల్ ఇప్పుడు మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈయ‌న త‌ర్వాతి సినిమా ఎవ‌రితో అనే టాక్ ఇప్ప‌ట్నుంచే మొద‌లైంది. ఎందుకంటే డిసెంబ‌ర్ 3 నాటికి మ‌జ్ను షూటింగ్ పూర్త‌యిపోతుంది. అప్ప‌ట్నుంచీ మ‌ళ్లీ ఖాళీనే ఈ హీరో. దాంతో నెక్ట్స్ ఏంటి అనే టాపిక్ ఇప్పుడే మొద‌లైంది ఫ్యాన్స్ లో. దీనికి అఖిల్ నుంచి ప్ర‌స్తుతానికి ఎలాంటి స‌మాధానం లేదు. ఎందుకంటే ఈయ‌న‌కు కూడా త‌ర్వాత ఏంటి అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ న‌టించ‌బోతున్నాడ‌ని.. ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ లో నిర్మిస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడి పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. అత‌డే మిత్ర‌న్. ఈయ‌న‌పై మ‌న ప్రేక్ష‌కుల‌కు అస్స‌లు ఐడియా కూడా ఉండ‌దు. 

ఎవ‌రీ మిత్ర‌న్ అనే అనుమానం కూడా రావ‌చ్చు. ఈయ‌నెవ‌రో క్లారిటీ రావాలంటే ఒక్క‌సారి విశాల్ అభిమ‌న్యుడు గుర్తు చేసుకోండి. అత‌డే ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న‌తోనే అఖిల్ సినిమా చేస్తున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అఖిల్ కు ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చింద‌ని తెలుస్తుంది. ముందు నుంచి త‌మిళ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు అఖిల్. ఆ మ‌ధ్య కూడా ఆది అన్న‌య్య స‌త్య‌ప్రభాస్ తో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు కానీ నాగార్జున చెప్ప‌డంతో వెన‌క్కి త‌గ్గాడు. మొత్తానికి అఖిల్ నాలుగో సినిమాపై ఇప్పుడు ర‌స‌వ‌త్త‌ర‌మైన చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

More Related Stories