English   

శంక‌ర్, రాజ‌మౌళి.. ఎవ‌రు గొప్ప‌..?  

Shankar-Rajamouli
2018-11-30 12:01:22

ప్ర‌శ్న చాలా సిల్లీగా ఉంది క‌దా.. అస‌లు ఇద్ద‌రికీ పోటీ ఏంటి..? ఇద్ద‌రూ గొప్ప ద‌ర్శ‌కులే.. పైగా మ‌న సౌత్ ఇండ‌స్ట్రీ జెండానే బాలీవుడ్ లో కూడా పాతిన ద‌ర్శ‌కులు క‌దా.. వాళ్ళ‌కు పోటీ ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రూ గొప్ప ద‌ర్శ‌కులే కానీ ఇద్ద‌రిలో ఎవ‌రు గొప్ప అనే టాక్ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. ఫ్యాన్స్ కూడా ఇదే త‌ల ప‌ట్టుకుంటున్నారు ఇప్పుడు. ఇప్ప‌టికే రాజ‌మౌళి తానేంట‌నేది బాహుబ‌లితో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు 2.0 విడుద‌లైంది. విఎఫ్ఎక్స్ వాడుకోవ‌డంలో త‌న‌ను మించిన వాళ్లు ఇండియాలోనే లేరు అంటూ మ‌రోసారి నిరూపించాడు శంక‌ర్. అయితే కంటెంట్ వైజ్ గా త‌న‌ను మించిన వాళ్ళు లేర‌ని రాజ‌మౌళి కూడా నిరూపించుకున్నాడు. ఎందుకంటే బాహుబ‌లిలో గ్రాఫిక్స్ ఎంతున్నాయో.. క‌థ కూడా అంతే ఉంది. ఎమోష‌న్స్ ఉన్నాయి.. కానీ 2.0లో అది మిస్ అయింది. కేవ‌లం గ్రాఫిక్స్ తోనే ముందుకు వెళ్లి రాజ‌మౌళిని త‌న‌కంటే ముందు స్థానంలో ఉంచాడు శంక‌ర్. ఇప్పుడు లెక్క‌ల ప్ర‌కారం చూస్తుంటే రాజ‌మౌళి కాస్త ఎడ్జ్ లో ఉన్నాడు శంక‌ర్ కంటే. పైగా 2.0 సినిమాకు అంత బ‌డ్జెట్ పెట్ట‌డానికి కార‌ణం కూడా రాజ‌మౌళే. ఈ విష‌యం శంక‌ర్ చెప్పాడు. 

500 కోట్లు పెట్టి సినిమా చేసిన‌పుడు ఎలా మీరు ఒత్తిడిని జ‌యిస్తారు అంటూ అడిగాడు. దానికి ఆయ‌న కూడా చాలా హూందాగా స‌మాధానం ఇచ్చాడు. రాజ‌మౌళి గారు మీరంటే నాకు చాలా ఇష్టం.. అలాగే నేను మీ ఫ్యాన్ అన్నాడు శంక‌ర్. అంత పెద్ద ద‌ర్శ‌క‌డు అయి ఉండి కూడా మ‌రో ద‌ర్శ‌కుడికి తాను ఫ్యాన్ అని చెప్పుకోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే. పైగా రాజ‌మౌళి కంటే ముందే శంక‌ర్ స్టార్ డైరెక్ట‌ర్. ఇండియ‌న్ సినిమాకు సౌత్ స‌త్తా చూపించిన ద‌ర్శ‌కుడు. అలాంటి ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎలాంటి బేష‌జాలు లేకుండా రాజ‌మౌళికి ఫ్యాన్ అని చెప్పుకోవ‌డం గొప్పే. ఇక ప్రెజ‌ర్ ఎలా హ్యాండిల్ చేస్తానంటే నేను క‌ష్ట‌ప‌డ‌తాను రాజ‌మౌళి గారు.. అదే నా బ‌లం అని చెప్పాడు శంక‌ర్. బాహుబ‌లికి అంత బ‌డ్జెట్ పెట్టినా కూడా కూల్ గా ఉన్నారు.. నేను అంతే అన్నాడు. ఇక ఇప్పుడు 2.0 విడుద‌లైంది.. టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది.. విజువ‌ల్ గ్రాండియ‌ర్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి ఈ గ్రాఫిక్స్ సినిమాను ఎంత ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. కానీ ఒక్క‌టి మాత్రం నిజం. రాజ‌మౌళి కంటెంట్ తో పాటు ఎమోష‌న్ ను న‌మ్ముకున్నాడు.. కానీ శంక‌ర్ మాత్రం కేవ‌లం విజువల్ ను మాత్ర‌మే న‌మ్ముకున్నాడు. ఇదే తేడా.. 

More Related Stories