English   

శంక‌ర్ ఎందుకు ఇలా అయిపోయాడు..?

Shankar
2018-11-30 16:40:02

ఒక‌ప్పుడు శంక‌ర్ సినిమా అంటే బ‌ల‌మైన క‌థ‌తో పాటు విజువ‌ల్ కూడా ఉండేది. కానీ ఎందుకో తెలియ‌దు కానీ కొన్నేళ్లుగా శంక‌ర్ సినిమాల్లో క‌థ ఉండ‌టం లేదు కేవలం విజువ‌ల్స్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. న‌మ్బ‌న్ నుంచే శంక‌ర్ మారిపోయాడు. దానికి ముందు వ‌ర‌కు కూడా బ‌ల‌మైన క‌థ‌లు చెప్పిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మాత్రం పూర్తిగా విజువ‌ల్స్ మీదే ఆధార‌ప‌డుతున్నాడు. రోబోలో క‌థ‌తో పాటు విజువ‌ల్స్ వ‌స్తాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. క‌థ లేకుండా కేవ‌లం గ్రాఫిక్స్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఎంత‌సేపూ అక్క‌డ విజువ‌ల్స్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి కానీ శంక‌ర్ విజ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు 2.0 కూడా నిజంగానే ఇది ఇండియ‌న్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే అనుమానం వ‌చ్చేలా తెర‌కెక్కించాడు శంక‌ర్. కానీ నిజంగా సినిమా బాగుందా అంటే మాత్రం ఏమో అనే స‌మాధాన‌మే వ‌స్తుంది. ఈ విష‌యంలో రోబో చాలా ముందుంది. ఎందుకంటే అందులో గ్రాఫిక్స్ త‌క్కువ‌.. క‌థ ఎక్కువ‌గా ఉంది. 

కానీ ఇప్పుడు అలా కాదు. అస‌లు క‌థే లేకుండా కేవ‌లం గ్రాఫిక్స్ తోనే క‌థ న‌డిపించాడు శంక‌ర్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కొన్నేళ్లుగా శంక‌ర్ ఇలా త‌డ‌బ‌డ‌టానికి కార‌ణం కూడా ఉంది. ఒకప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర ముగ్గురు రైట‌ర్స్ ఉండేవాళ్లు. అందులో ఓ సీనియ‌ర్ చ‌నిపోయాడు.. ఆ త‌ర్వాత ఇద్ద‌రు బ‌య‌టికి వెళ్లిపోయారు. అట్లీ కుమార్ కూడా ఇందులో  ఒక‌రు. అలా ఇప్పుడు శంక‌ర్ ఒంట‌రివాడు అయిపోయాడు. దాంతో ఆయ‌న విజువ‌ల్స్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నాడు కానీ ఆ మోజులో ప‌డి క‌థ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్పుడు 2.0 కు కూడా ఇదే జ‌రిగింది. టేకింగ్ అండ్ మేకింగ్ లో ఆయ‌న కింగ్.. కానీ క‌థ విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డ్డాడు అంటున్నారు. మొత్తానికి మ‌రి భార‌తీయుడు 2లో అయినా అది లేకుండా క‌థ ఉండేలా చూసుకుంటాడేమో చూడాలిక‌. 

More Related Stories