English   

అన్న‌గారు అడుగేస్తే ఆంధ్రా సీడెడ్ నైజాం అదుర్స్.. 

NTR-biopic
2018-12-01 12:04:49

ఇప్పుడు ఎన్టీఆర్ పోస్ట‌ర్ లో బాల‌య్య‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఆయ‌న ఠీవీ చూస్తుంటే ఇది క‌దా తెలుగు వాడి వేడి అనిపించ‌క మాన‌దు. తెలుగు జాతి కోసం పాటుప‌డిన ఈ యుగ‌పురుషుడి బ‌యోపిక్ అనేస‌రికి అంద‌రిలోనూ ఆ ఆస‌క్తి క‌నిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏ మాత్రం త‌గ్గించ‌కుండా క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. విడుద‌ల‌వుతున్న ఒక్కో పోస్ట‌ర్ ఇప్పుడు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు విడుద‌లైన పోస్ట‌ర్ అయితే ఎన్టీఆర్ లోని మ‌రో కోణాన్ని చూపిస్తుంది. ఆవేశంగా ఆయ‌న అలా న‌డుస్తూ వ‌స్తుంటే అద‌ర‌హో అనిపించింది. పంచెక‌ట్టు కూడా బాల‌య్య గెట‌ప్ ను మ‌రో స్థాయిలో హైలైట్ చేసింది. డిసెంబ‌ర్ 3 ఉద‌యం 7.42 నిమిషాల‌కు క‌థానాయ‌క సాంగ్ విడుద‌ల కానుంది. కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కుడు.
 
పంచెక‌ట్టుకు అంటే ఎన్టీఆర్ అప్ప‌ట్లో క్రేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే మ‌రోసారి ప్రేక్ష‌కుల క‌ళ్ల‌ముందుకు తీసుకొస్తున్నారు బాల‌య్య‌. ఇప్పుడు ప్ర‌చారం కూడా పెద్దాయ‌న గెట‌ప్ లోనే బాల‌య్య చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఈ లుక్ లో ఉన్న పోస్ట‌ర్స్.. బ్యాన‌ర్స్ కూడా సిటీలో చాలా చోట్ల పెట్టేసారు. పైగా బాల‌య్య కూడా టీడిపి ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ను పార్టీ కోసం కూడా వాడుకుంటున్నాడు బాల‌య్య‌. అటు సినిమా.. ఇటు ప్ర‌మోష‌న్.. మ‌రోవైపు ప్ర‌చారం మూడింటిని స‌రిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. మ‌రి ఈ అంచ‌నాలు సినిమాకు ఎంత‌వ‌ర‌కు ప‌నికొస్తాయో చూడాలిక‌. జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత 15 రోజుల గ్యాప్ తీసుకుని జ‌న‌వ‌రి 24న మ‌హానాయ‌కుడు విడుద‌ల కానుంది.

More Related Stories