English   

అయ్యోరామ.. మ‌ణిక‌ర్ణిక మ‌ళ్లీ ఆగిపోయిందిగా.. 

Kangana-Ranaut
2018-12-01 13:02:28

కొన్ని సినిమాలకు ఎందుకో తెలియ‌దు కానీ అలా కొన్ని ఆటంకాలు అలా వ‌స్తుంటాయి అంతే. మ‌ణిక‌ర్ణిక విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ సినిమాకు ముందు నుంచి క‌ష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ మ‌ధ్య టీజ‌ర్ చూసిన త‌ర్వాత కంగ‌న రనౌత్ ఈ పాత్ర‌లో లీన‌మైపోయిన తీరు చూసి ఔరా అనుకున్నారు. బాలీవుడ్ లో క్రిష్ కు ఇది రెండో సినిమా. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించిన గ‌డ్డ‌పైనే మ‌ణిక‌ర్ణిక షూటింగ్ ఏడాదిన్న‌ర కింద మొద‌లు పెట్టాడు క్రిష్. మూడు నెల‌ల కిందే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చాడు క్రిష్. అయితే మ‌ధ్య‌లో కంగ‌న ర‌నౌత్ కు యాక్సిడెంట్ కావ‌డం.. ఆమెతోనే వివాదాలు విభేధాల కార‌ణంగా సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు. మిగిలిన పార్ట్ తో పాటు కొంత భాగం రీ షూట్లు కూడా కంగ‌న తానే సొంతంగా చేసుకుంది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. 

మూడు నెల‌లుగా సినిమాకు ప‌నిచేస్తున్న వ‌ర్క‌ర్స్ కు జీతం ఇవ్వ‌క‌పోవ‌డం.. 1.5 కోటి బాకీ ప‌డ‌టంతో ఇప్పుడు వాళ్లు వాళ్ల ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా మూవీ ఎంప్లాయీస్ ను ఆశ్ర‌యించారు. వాళ్ల బాకీ తీర్చే వ‌ర‌కు సినిమా షూటింగ్ ఆపేయాల‌ని ఆదేశించారు వాళ్లు. దాంతో మ‌ణిక‌ర్ణికు మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. 1828లో కాశీలోనే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించింది. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కంగ‌న ర‌నౌత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రం కోసం క్రిష్ తో పాటు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ను కూడా ఎంచుకుంది. మ‌ణిక‌ర్ణిక సినిమాకు క‌థ అందించింది ఆయ‌నే. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ క‌ష్టాల‌ను చూస్తుంటే సినిమా ఎప్పుడొస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 2019 జ‌న‌వ‌రి 25న సినిమా అని డేట్ ఇచ్చినా ఇప్పుడు వ‌స్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

More Related Stories