English   

ప్లేట్ తిప్పిన రాధిక ఆప్టే.. సౌత్ ఇండ‌స్ట్రీ అంటే ప్రాణం..

Radhika-Apte
2018-12-01 13:37:37

అదేంటి.. ఎప్పుడు చూడు సౌత్ ఇండ‌స్ట్రీని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న రాధిక ఆప్టే ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా..? ఒక్కోసారి అంతే మ‌రి. అవ‌స‌రం ఎలాంటి వాళ్ల‌నైనా ఎలాగైనా మార్చేస్తుంది. ఇప్పుడు రాధిక విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఒక్క‌సారి ఈమె త‌న కెరీర్ మొద‌లును గుర్తు చేసుకుంది. అప్పట్లో ఆమె ప‌డిన క‌ష్టాలు.. చేసిన అప్పులు గుర్తు చేసుకుంది. దాంతో పాటే ఆదుకున్న వాళ్లను కూడా మ‌న‌సులో పెట్టుకుంది. ఇప్పుడు ఇదే విష‌యాన్ని చెప్పింది రాధిక‌. వ‌ర్మ తెర‌కెక్కించిన ర‌క్త‌చ‌రిత్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైంది రాధిక ఆప్టే. ఈ చిత్రంలో ప‌రిటాల ర‌వి భార్య సునీత పాత్ర‌లో న‌టించింది రాధిక ఆప్టే. ర‌క్త‌చ‌రిత్ర హిట్ కావ‌డంతో రాధిక ఆప్టే పేరు బాగానే వినిపించింది. ఆ త‌ర్వాత ధోనీ.. లెజెండ్.. ల‌య‌న్ లాంటి సినిమాల్లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. 

వీటితో వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే బ్యాంక్ లోన్ కూడా తీర్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే సౌత్ ఇండ‌స్ట్రీ అంటే ప్రాణం అంటుంది. లండన్‌లో చదువుకునేప్పుడు బ్యాంక్ రుణం కట్టడానికి చాలానే ఇబ్బంది పడ్డాన‌ని చెప్పింది రాధిక ఆప్టే. ఆ స‌మ‌యంలో డ‌బ్బు చాలా పెద్ద ఇష్యూ అని.. అప్పుడే ర‌క్త‌చ‌రిత్ర‌తో పాటు మ‌రిన్ని అవ‌కాశాలు కూడా వ‌చ్చాయ‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. పోనీలే ఎప్పుడూ తిట్టినా కూడా క‌నీసం అప్పుడ‌ప్పుడు అయినా ఇక్క‌డ వాళ్లు చేసిన మంచిని గుర్తు పెట్టుకుంది అదే చాలు అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒక‌ప్పుడు ఇక్క‌డ కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని.. ఓ స్టార్ హీరో త‌న‌ను ప‌డ‌క‌గ‌దికి ర‌మ్మ‌న్నాడ‌ని అడిగాడ‌ని సంచ‌ల‌నం సృష్టించింది రాధిక‌. ఇప్పుడు క‌నీసం నిజాలు గుర్తు చేసుకుని.. ఇక్క‌డ మంచోళ్లు కూడా ఉన్నార‌ని చెప్ప‌డం గుడ్డిలో మెల్లే.

More Related Stories