English   

విన‌య విధేయ రామ‌.. తందానే తందానే..

Vinaya-Videya-Rama
2018-12-01 15:56:04

విన‌య విధేయ రామ‌లో ఇప్పుడిప్పుడే మ‌రో కోణం బ‌య‌టికి వ‌స్తుంది. ఇందులో యాక్ష‌న్ మాత్ర‌మే కాదు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉన్నాయ‌ని త‌న పోస్ట‌ర్స్ తో చూపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. మొద‌ట్లో వ‌ర‌స‌గా వ‌యోలెన్స్ మాత్ర‌మే చూపిస్తూ వ‌చ్చిన బోయ‌పాటి ఇప్పుడు కుటుంబాల‌ను చూపిస్తున్నాడు. అందులోని ఎమోష‌న్స్ ను హైలైట్ చేస్తున్నాడు. తాజాగా మ‌రో పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. ఇందులో కూడా కుటుంబంతో క‌లిసి ఉన్న ఫోటోను విడుద‌ల చేసాడు బోయ‌పాటి శీను. ఇది చూస్తుంటే విన‌య విధేయ రాముడు ఎంత చ‌క్క‌గా ఉంటాడో అర్థం అయిపోతుంది. ముందు టీజ‌ర్ చూస్తుంటే మాత్రం ఒక్కొక్క‌ర్ని కాదు షేర్ ఖాన్ 100 మందిని ర‌మ్మ‌ను అన్న‌ట్లు మ‌గ‌ధీర రేంజ్ యాక్ష‌న్ గుర్తులు. అస‌లు టీజ‌ర్ కు టైటిల్ కు ఎక్క‌డా పొంతన కూడా లేదు. పైగా టీజ‌ర్ కూడా చాలా యావ‌రేజ్ గా ఉందంటూ విన‌య విధేయ రామ‌పై చాలానే రొటీన్ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

దాంతో అక్క‌డుండానే వ‌రం ఇచ్చేసాడు చ‌రణ్. కార్తిక పౌర్ణ‌మి కానుక‌గా అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు. ఇప్పుడు మ‌రో పోస్ట‌ర్ విడుదల చేసారు. తందానే తందానే పాట‌ను డిసెంబ‌ర్ 3 సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇందులో చాలా విన‌యంగా ఉన్నాడు ఈ రాముడు. ఇప్పుడు టైటిల్ కు పూర్తి న్యాయం చేసాడు రామ్ చ‌ర‌ణ్. చాలా ఒద్దిక‌గా ప‌ద్ద‌తిగా.. అంద‌రితో ఆడుకుంటూ క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ టైటిల్ విన‌య విధేయ రామ అంటే ఒప్పుకునేలా ఉంది. కానీ టీజ‌ర్ మాత్రం అలా కాదు. సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోష‌న్స్ చాలానే ఉన్నాయంటున్నాడు బోయ‌పాటి శ్రీను. అస‌లే క‌థే ప‌క్కా కుటుంబ క‌థా చిత్రం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న ఎమోష‌న్స్ అన్నీ ర‌క్త‌లొచ్చేలా ఉంటాయి. అవి ఎక్కితే బ్లాక్ బ‌స్ట‌రే లేదంటే అంతే సంగ‌తులు. అయితే బోయ‌పాటి లెక్క ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాగ్జిమ‌మ్ త‌ప్ప‌లేదు. ఆ మ‌ధ్య ఓసారి ద‌మ్ము.. మొన్న జ‌య జాన‌కీ నాయ‌కా త‌ప్పిస్తే అన్ని సినిమాలు బాగానే ఆడాయి. దాంతో ఇప్పుడు సంక్రాంతికి రాబోయే విన‌య విధేయ రామ కూడా కుమ్మేయ‌డం ఖాయం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. 

More Related Stories