English   

ఇదేం ట్రైలర్ బాబోయ్.. 

Simbu
2018-12-01 16:48:45

కొన్ని సినిమాలు రీమేక్ అవుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటా. కారణం.. ఆ సినిమాలు తొలిభాషలో బిగ్గెస్ట్ హిట్ కావడమే. అందుకే అత్తారింటికి దారేదీ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుందంటే కూడా చాలామంది ఇలాగే చూశారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేదీ.. ఆ టైమ్ కు చాలా రికార్డ్స్ బద్ధలు కొట్టింది. అలాంటి సినిమా రీమేక్ అవుతుందంటే ఆ భాషలోనే అదే స్థాయి విజయం సాధిస్తుందనే అనుకుంటారెవరైనా. ఇక తమిళ్ లో ఈ మూవీని శింబు రీమేక్ చేస్తన్నాడనగానే చాలామంది సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందనుకున్నారు. అందుకు కారణం.. అక్కడ అతని ఇమేజ్. అందుకు తగ్గట్టుగా ఉండే ఈ కథే. 

లేటెస్ట్ గా ‘వంత రాజవతాన్ వరువేన్’ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలన్నీ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. నిజానికి వీళ్లు దీన్ని టీజర్ అన్నారు. కానీ రెండు నిమిషాలకు పైగా ఉంది. అయితే సినిమా ఎలా ఉంటుందనేది ముందే తెలిసిపోయేలా.. ఈ టీజరే చాలా బోరింగ్ గా అనిపించింది. 

తమిళ్ లో సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నాడు. నదియా పాత్రలో రమ్యకృష్ణ, రావు రమేష్ గా ప్రభు నటించారు. హీరోయిన్లు గా మేఘా ఆకాశ్, కేథరీన్ థ్రెస్సా నటించారు. యోగిబాబు, రాజేంద్రన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ టీజర్ లోనే మనకు ఆల్మోస్ట్ అత్తారింటికి దారేదీ సినిమా అంతా కనిపిస్తుంది. ఏదేమైనా ఇది మంచి కట్ కాదనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఇది వాళ్లకు కొత్త కాబట్టి నచ్చి ఉండొచ్చేమో కానీ.. మనకు మాత్రం అస్సలు నచ్చదు. 

More Related Stories