English   

నాగార్జున అమ్మాయిలు కావాలంటున్నాడా..? 

Nagarjuna
2018-12-01 17:42:58

టైటిల్ చూసి మ‌రోలా అనుకోవ‌ద్దు. అమ్మాయిలు కావాలి అనుకోవ‌డం సినిమా కోస‌మే. క‌థ కోస‌మే.. త‌న కారెక్ట‌ర్ కోస‌మే. అంత‌కంటే ఏం లేదు. ఒక‌ప్పుడు అమ్మాయిలు వ‌ద్దు వ‌ద్దు అంటూ ఆయ‌న చేసిన సినిమా మ‌న్మ‌థుడు. త్రివిక్ర‌మ్ క‌థ‌, మాట‌లు రాసిన ఈ చిత్రాన్ని విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రం 2002 చివ‌ర్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాలో నాగ్ కారెక్ట‌ర్ అలా నిలిచిపోయింది. ఆయ‌న కెరీర్ మొత్తంలో టాప్ 3 సినిమాల్లో ఇది కూడా ఉంటుంది. ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్ గా నిలిచిపోయింది మ‌న్మ‌థుడు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 వ‌స్తుంది. ఈ సినిమాలో ముందు నాగార్జున హీరో కాదేమో.. చైతూ కోస‌మేమో అనుకున్నారంతా. కానీ ఇందులో కూడా నాగార్జున హీరోగా న‌టించ‌నున్నాడు. చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఇప్ప‌టికే మ‌న్మ‌థుడు 2 కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. 

ఈయ‌న చెప్పిన లైన్ న‌చ్చి అన్న‌పూర్ణ‌లో అవ‌కాశం ఇస్తున్నాడు నాగార్జున‌. ఈ సినిమా జ‌న‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. మ‌న్మ‌థుడులో హీరోకు అమ్మాయిలు అంటే పడ‌రు.. మ‌రి ఇందులో ఎలా ఉంటుందో హీరో కారెక్ట‌ర్ అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. సోగ్గాడే చిన్నినాయ‌నాలో అమ్మాయిల‌తోనే ఉంటాడు బంగార్రాజు. మ‌రి అలా ఉంటుందా..? అదీ కాదంటే అప్ప‌ట్లాగే మ‌న్మ‌థుడు అమ్మాయిల‌కు మ‌రింత దూరంగా ఉంటాడా..? అస‌లు ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలియ‌దు కానీ రాహుల్ ర‌వీంద్ర‌న్ మాత్రం చాలా పెద్ద బాధ్య‌త భుజాన‌ వేసుకున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ బుర్ర‌ను మించి రాయాలంటే అంత చిన్న విష‌యం కాదు. మ‌రి చూడాలిక‌.. ఈ బాధ్య‌త‌లో రాహుల్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో..? వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం నాగార్జున రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ర‌ణ్ బీర్ క‌పూర్ బ్ర‌హ్మాస్త్ర‌.. ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండింటి త‌ర్వాత మ‌న్మ‌థుడు 2 ఉండ‌బోతుంది.

More Related Stories