English   

‘కవచం’ ఎంత గట్టిదో రేపే తెలిసిపోతుందా..?

Kavacham
2018-12-01 18:17:05

చాలా వేగంగా మాస్ హీరో అయిపోవాలని కథలు కదుపుతోన్న కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ దిశగా అతను వేస్తోన్నఅడుగులు బానే ఉంటున్నాయి కానీ.. కుర్రాడే ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉందనే టాక్స్ వస్తున్నాయి. ముఖ్యంగా డిక్షన్ లో అతను ఇంకా ఎన్ని సినిమాలు తీసుకుంటాడో కానీ అది మైనస్ గా ఉన్నంత కాలం మనోడికి ప్రాబ్లమ్ అవుతుందనేది నిజం. అతని ప్రీవియస్ మూవీ సాక్ష్యం మాగ్జిమం బావున్నా.. అతని మార్కెట్ ఇంకా అంత బడ్జెట్ తెచ్చేంతగా పెరగలేదు. దీంతో రూట్ మార్చాడు. మీడియం బడ్జెట్ సినిమాలతో వరుసగా రాబోతున్నాడు. ఈ క్రమంలో అతను చేసిన కవచం ఈ నెల 7న విడుదల కాబోతోంది. అయితే అంతకు ముందే ఈ కవచం ఎంత గట్టిగా ఉంటుందనేది కూడా ఆడియన్స్ కు తెలియబోతోందనేది. 

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. ఆ పాటలను రేపు(02.12.118)న విడుదల చేస్తున్నారు. అంటే కవచం సినిమా ఆడియో రేపు విడుదల కాబోతోందన్నమాట. అంటే ఆడియోతో పాటుగానో ముందేనో.. ట్రైలర్ వస్తుంది కదా.. ఆ ట్రైలర్ ను బట్టి ఈ సినిమాను అంచనా వేయొచ్చు. అయితే ఆల్రెడీ విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాస్త థ్రిల్లర్ మోడ్ లో సాగుతుంది సినిమా అని చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ మామిళ్ల అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పోలీస్ గా నటిస్తున్నాడు శ్రీనివాస్. ఆ కాస్ట్యూమ్ అతనికి పర్ఫెక్ట్ గా ఫిట్ అవడం కొంత పాజిటివ్ గా ఉంది. మొత్తంగా రేపు ఈ కవచం ఎంత గట్టిగా ఉండబోతోందనే విషయం ట్రైలర్ తో తెలుస్తుంది.  

More Related Stories