English   

శర్వానంద్ వర్సెస్ వరుణ్ తేజ్ .. 

Varun-Tej-Sharwanand
2018-12-01 18:30:54

కాంపిటీషన్ ఉంటేనే ఖలేజా తెలుస్తుంది. పోటీ ఉంటేనే మేటి ఎవరనేది తెలుస్తుంది. కానీ కొన్నేళ్లుగా మన పరిశ్రమలో స్టార్ హీరోలు పోటీకి దూరంగా ఉంటున్నారు. కలెక్షన్స్ తగ్గుతాయనో.. థియేటర్స్ దొరకవనో సాకులు చెబుతున్నారు.. కానీ నిజానికి వాళ్లు పోటీలో నిలబడితే కంటెంట్ మాత్రమే గెలుస్తుంది. ఆడియన్స్ కు మంచి సినిమాలు మాత్రమే ఇవ్వాలనే కసీ పెరుగుతుంది. ఆ మేటర్ అలా ఉంచితే ప్రస్తుతం యంగ్ జెనరేషన్ హీరోలు కూడా ఈ పోటీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడో కానీ ఇద్దరూ ఒకే రోజు రావడం లేదు. ఎప్పుడో అనౌన్స్ అయినా.. ఈ నెల 21న శర్వానంద్, వరుణ్ తేజ్ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఓ సిమిలారిటీ ఉంది. 

శర్వానంద్ కెరీర్ ఆరంభంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. కానీ అప్పట్లో రొటీన్ సినిమాల హవా నడుస్తోంది. తర్వాత శర్వా కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్ లోకి వచ్చేశాడు. బట్ వరుణ్ మాత్రం మొదట్నుంచీ శర్వా లాగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వార్ లో పోటీ పడుతుండటం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. 

ఈ నెల 21న శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన ‘పడిపడి లేచె మనసె’ విడుదల కాబోతోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీని 90స్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించినట్టు టాక్. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు, లేటెస్ట్ గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపైనా పూర్తిగా పాజిటివ్ బజ్ ఉంది.. దీంతో శర్వా స్ట్రాంగ్ హిట్ తో 2018కు గ్రాండ్ సెండాఫ్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు.

ఒక ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీతో దేశం మొత్తాన్నీ ఆకట్టుకున్నాడు. ఈ సారి ‘అంతరిక్షం’ అంటూ వస్తున్నాడు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటించిన ఈ హాఫ్ స్పేస్ మూవీ పైనా భారీ అంచనాలున్నాయి. మరి ఈ ఇద్దరు స్టార్స్ లో విన్ అయ్యేది ఎవరో కానీ.. విన్నర్స్ ను మాత్రం ఈ యేడాది ది బెస్ట్ హీరోస్ లిస్ట్ లో వేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా ఈ యంగ్ స్టర్స్ మధ్య పోటీ మాత్రం కాస్త గట్టిగానే ఉందని చెప్పాలి.  

More Related Stories