English   

అనుష్క అందుకు అన్ని విధాలా రెడీ అయిందా..?

Anushka-Shetty
2018-12-01 21:32:37

మొన్నటి క్యూటీ స్వీటీ బ్యూటీ అనుష్క ఇప్పుడు ఛబ్బీ బ్యూటీ అయిపోయింది. దీంతో బాహుబలి వంటి సూపర్ మూవీ తర్వాత కెరీర్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. భాగమతి చేసినా అందులోనూ అతనూ హెవీ వెయిట్ తో ఉండటంతో ఈ క్యూటీని అలా చూడలేకపోయారు ఆడియన్స్. దీంతో ప్రస్తుతం బరువు తగ్గి తన పాత షేప్ తెచ్చుకోవడానికి నేచురల్ పద్ధతిలో విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఇప్పటికే నెల రోజులకు పైగా అవుతోంది తనా ట్రీట్మెంట్ కు వెళ్లి. మరి ఎంత తగ్గిందో.. తెలియదు కానీ.. ఇక తన ‘సైలెన్స్’ బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఇన్నాళ్లూ ఫ్యాన్స్ ఏ న్యూస్ కోసం వెయిట్ చేశారో ఆ న్యూస్ వినిపించడానికి సిద్ధమవుతోంది. ఆ న్యూస్ కొత్త యేడాది ఆరంభం నుంచి వినిపిస్తుందట. 

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ దేవసేన కొన్నాళ్ల క్రితం ఓ కొత్త సినిమా ఒప్పుకుంది కదా.. ఆ సినిమా పేరు ‘సైలెన్స్’. మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గతంలో మంచు విష్ణుతో వస్తాడు నా రాజు అనే సినిమా తీసిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా కథ చాలా వెరైటీగా ఉంటుందట. అఫ్ కోర్స్ కొత్తదనం లేకపోతే ఇప్పుడు అనుష్కే కాదు.. మాధవన్ కూడా ఓ కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ కొంత ఆసక్తి ఉంది. మొత్తంగా చాలా రోజులుగా అనుష్క కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తోన్న అభిమానులకు పైనల్ గా అసలు వార్త చెప్పేశారు. 2019 జనవరి చివరి నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుందట. దక్షిణాదిలోని నాలుగు భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నారట. అంటే అనుష్క ట్రీట్మెంట్ అయిపోగానే అట్నుంచి అటే అమెరికా వెళుతుందన్నమాట.  ఇక ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించి వివరాలు కూడా అప్పుడే చెబుతారని టాక్. 

More Related Stories