English   

ప్రియాంక చోప్రా శ్రీ‌మతి అయిపోయింది..   

Priyanka-Chopra
2018-12-02 08:53:32

ఇక కుమారి ప్రియాంక చోప్రా లేదు.. ఇప్పుడు అమెరికా కోడ‌లు అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. తాను ప్రేమించిన అబ్బాయి నిక్ జోన్స్ నే పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. డిసెంబ‌ర్ 1న జోధ్‌పూర్‌లోని ప్యాలెస్ లో ప్రియాంక చోప్రా పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. అయితే ముందు ఈ పెళ్లి క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తిలో జ‌ర‌గ‌గా.. ఆ త‌ర్వాత హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం జరగనుంది. దీని ఏర్పాట్లు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. ఈ పెళ్లికి చాలా త‌క్కువ మంది వ‌చ్చారు. నెల రోజుల పాటు పూర్తిగా త‌మ పెళ్లి ప‌నుల్లోనే మునిగిపోయిన ఈ జంట‌.. త‌మ పెళ్లిని కూడా ఎప్ప‌టికీ గుర్తుంచుకునేలా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. వీళ్ల పెళ్లి ఫోటోలు కూడా భారీ రేట్ కు అమ్ముడైపోయాయి. ప్రియాంక చోప్రా-నిక్‌ జొనాస్ ఎక్స్ క్లూజివ్ పెళ్లి ఫొటోల కోసం ఓ మ్యాగ‌జైన్ ఏకంగా 18 కోట్లు చెల్లించింది ప్రియాంక చోప్రాకు. 

సెలెబ్రెటీస్ వివాహాల‌కు ఇలా డ‌బ్బులిచ్చి రైట్స్ తీసుకోవ‌డం ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోయింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇదే చేసింది. డిసెంబ‌ర్ 4న ప్రియాంక చోప్రా నిక్ ల విందు ముంబైలో జ‌ర‌గ‌నుంది. దీనికి బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ వేత్త‌లు కూడా రానున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు ముంబైలో ఇప్ప‌టికే ఊపందుకుంటున్నాయి. దానికోసం ప్ర‌త్యేకంగా అమెరికా నుంచి కూడా మాస్ట‌ర్ చెఫ్ లు వ‌స్తున్నారు. ప్రియాంక చోప్రా పెళ్లి బ‌ట్ట‌ల కోస‌మే దాదాపు 20 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇక నిక్ గుర్రంపై వ‌చ్చి త‌న‌కు కాబోయే భార్య‌ను తీసుకెళ్లాడు. ఇదే పెళ్లిలో హైలైట్ గా నిలిచింది. పెళ్లికి అతి త‌క్కువ మంది హాజ‌రైనా విందుకు మాత్రం బాలీవుడ్ అంతా రానుంది. ముఖ్యంగా త‌న‌కు కావాల్సిన వాళ్ల‌ను మాత్రం ప్ర‌త్యేకంగా ప్రియాంక వెళ్లి మ‌రీ ఆహ్వానించింది. 

More Related Stories