English   

ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా.. 

Kathanayaka-song
2018-12-03 08:49:17

తెలుగులో ఇలాంటి ప‌దాలు విని చాలా కాల‌మైంది క‌దా. అస‌లు ఇలాంటి ఓ ప‌దాలు ఉన్నాయ‌ని కూడా ఈ త‌రానికి తెలియ‌దు. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చే ఇలాంటి పాట‌ల వ‌ల్ల‌.. ఇలాంటి మ‌నుషుల వ‌ల్ల తెలుగు గొప్ప‌త‌నం మ‌రింత పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం కీర‌వాణి తండ్రి శివ‌శ‌క్తిద‌త్తా రాసిన క‌థానాయ‌కా పాట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిపోయింది. అస‌లు ఈ పాట‌లోని ప‌దాల అల్లిక చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. ఈ పాట ఇప్పుడు సంచ‌ల‌నం అయిపోయింది. ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర జ‌న‌తాసుధీంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా అంటూ మొద‌లైన ఈ పాటలో ఎన్నో తెలుగు ప‌దాలతో ఎన్టీఆర్ ఖ్యాతిని వ‌ర్ణించాడు శివ‌శ‌క్తిద‌త్తా. ఆయ‌న వేసిన ప్ర‌తీ పాత్ర‌ను కూడా ఇందులో చూపించాడు. 

300 కు పైగా చిత్రాల్లో న‌టించిన ఎన్టీఆర్ కు త‌న ప‌ద నీరాజ‌నం అందించాడు క్రిష్. త్రిశ‌కాధికా చిత్ర‌మాలికా ఓ క‌థానాయ‌కా.. ఆహార్యాధ్భుత వాచికా జైత్ర‌యాత్రికా అంటూ ఎన్టీఆర్ ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేసాడు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ పాట‌లో పెద్దాయ‌న గొప్ప‌త‌నం తెలుగువాళ్ల గుండె ఉప్పొంగేలా వ‌ర్ణించాడు క్రిష్‌. ఇక కీర‌వాణి కూడా అద్భుత‌మైన ట్యూన్ ఇచ్చాడు. కైలాష్ ఖేర్ వాయిస్ ఈ పాటకు మ‌రో బ‌లం. ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా ఎందుకు కీర‌వాణినే క్రిష్ ఎంచుకున్నాడ‌నేది ఇప్పుడు అర్థం అవుతుంది. ఇలాంటి సినిమాల‌కు తెలుగులో తాను త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు కీర‌వాణి. బాల‌కృష్ణ నిర్మిస్తున్న క‌థానాయ‌కుడు షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విడుద‌ల కానుంది. అదేనెల 24న మ‌హానాయ‌కుడు రానుంది. క్రిష్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఘ‌న‌కీర్తిప్ర‌తీక‌గా తెర‌కెక్కిస్తున్నాడు. 

More Related Stories