English   

ముగ్గుర‌మ్మాయిల‌తో అంటున్న ర‌వితేజ‌

Ravi-Teja
2018-12-03 10:34:15

అవును.. బ‌న్నీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో అంటే ర‌వితేజ ముగ్గుర‌మ్మాయిల‌తో అంటున్నాడు. మొన్న‌టికి మొన్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఇచ్చిన షాక్ నుంచి త్వ‌ర‌గానే కోలుకున్నాడు మాస్ రాజా. ఇక ఇప్పుడు న‌టిస్తున్న సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో జోడీ క‌ట్ట‌బోతున్నాడు. అస‌లు ఈయ‌న ఎంచుకుంటున్న క‌థ‌లు కూడా చాలా కొత్త‌గా ఉంటున్నాయి. కెరీర్ మొత్తంలో ఆయ‌న కాస్త కొత్త‌గా ట్రై చేద్దాం అని ముందడుగు వేసిన ప్ర‌తీసారి చ‌తికిల ప‌డ్డాడు. నాటి నా ఆటోగ్ర‌ఫ్ నుంచి నిన్న‌మొన్న‌టి సారొచ్చారు వ‌ర‌కు ర‌వితేజ‌కు ప్రయోగాలు పెద్ద‌గా ప‌డ‌లేదు. అయితే ఇప్పుడు ఏ ధైర్య‌మో ఆయ‌న్ని ముందుకు న‌డిపించింది. ఇప్పుడు విఐ ఆనంద్ తో ఈయ‌న ఓ కొత్త సినిమా చేయ‌బోతున్నాడు. కొత్త సినిమా అంటే కొత్త‌క‌థ అని అర్థం. నిన్న‌కాదు నేడుకాదు ఎప్పుడూ నే రాజా అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు ఈ చిత్రానికి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఇప్పుడు ఫిక్సైపోయారు. 

నేల‌టికెట్ ఫేమ్ రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో న‌న్ను దోచుకుందువ‌టే ఫేమ్ న‌భా న‌టేష్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. దానికితోడు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ మ‌రో హీరోయిన్.. ఇక ఇప్పుడు టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జ‌వాల్క‌ర్ కూడా మ‌రో హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది. టైగ‌ర్.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ.. ఒక్క‌క్ష‌ణం లాంటి డిఫెరెంట్ సినిమాల త‌ర్వాత ర‌వితేజ‌తో సినిమా ఓకే చేయించుకున్నాడు ఆనంద్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న కెరీర్ లో ఎప్పుడూ చేయ‌ని కొత్త జోన‌ర్ లో ఈ చిత్రం రానుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం పూర్తిస్థాయి సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తుంది. వ‌ర‌స ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయిన త‌న కెరీర్ కు ఈ చిత్రం కొత్త ఊపు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు మాస్ రాజా. అది కానీ జ‌ర‌గ‌లేదంటే ఇప్ప‌టికే ర‌వితేజ ఉన్నాడ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోలేదు ప్రేక్ష‌కులు.. ఇక ఇప్పుడు మ‌రిచిపోతారు. డిసెంబ‌ర్ లోనే సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. 

More Related Stories