English   

రాజ‌కీయాల్లో బాల‌య్య హాట్ క‌మెంట్స్.. 

Balakrishna
2018-12-03 11:44:02

బాల‌య్య ఎక్క‌డైనా డైలాగులు అద‌ర‌గొడుతుంటాడు. సినిమాల్లో రాసిన డైలాగులు అద‌ర‌గొడితే.. బ‌య‌ట త‌న‌కు వ‌చ్చిన డైలాగుల‌తో చెడుగుడు ఆడుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తెలుగుదేశం ప్ర‌చారంలో బిజీగా ఉన్న బాల‌కృష్ణ‌.. ప్ర‌చారంలో భాగంగా ప్ర‌త్య‌ర్థుల‌పై రెచ్చిపోయాడు. ప్ర‌తిపక్షాల‌ను త‌న మాట‌ల తూటాల‌తో ఆడుకున్నాడు. మ‌రీ ముఖ్యంగా బావ చంద్ర‌బాబును అంటున్న వాళ్ల‌పై నిప్పులు చెరిగాడు బాల‌కృష్ణ‌. త‌న హాట్ కామెంట్స్ తో రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాడు నంద‌మూరి న‌ట‌సింహం. తెలంగాణ‌లో ప్ర‌చారం చేస్తున్న బాల‌య్య‌.. బావ బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో చంద్రబాబు చరిత్ర ను ఎవరూ చేరపలేరు.. మార్చ‌లేరు అంటూ ఫైర్ అయ్యాడు బాల‌య్య‌. ఇక్క‌డ బాబు చేసిన అభివృద్ధి అంద‌రికీ తెలుసు అన్నారు బాల‌య్య‌. ఢిల్లీ గల్లీ లో కాళ్ళు పట్టుకునే వాడు కాదు చంద్రబాబునాయుడు అంటే అంటూ బావ గొప్ప‌త‌నం గురించి చెప్పాడు బాలయ్య బాబూ. ఐటీ స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు కూడా చంద్రబాబు ని విమర్శిస్తున్నారంటూ ఇక్క‌డ మంత్రుల‌పై.. రాజ‌కీయ నాయ‌కుల‌పై సెటైర్లు వేసాడు. మొత్తానికి బాల‌య్య పొలిటిక‌ల్ టూర్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న మాట‌లు కూడా ఇప్పుడు ప్ర‌తిపక్షాల్లో మ‌రింత నిప్పు రాజేస్తున్నాయి.

More Related Stories