English   

హ‌రీష్ శంక‌ర్ ఆ రీమేక్ చేస్తున్నాడా..? 

Harish-Shankar
2018-12-03 13:41:09

డిజే త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియ‌క పాపం విల‌విల‌లాడిపోతున్నాడు హ‌రీష్ శంక‌ర్. ఏ సినిమా చేయాల‌నుకున్నా కూడా ఆదిలోనే ఆగిపోతుంది. దాంతో ఇప్పుడు రీమేక్ క‌థవైపు అడుగేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అది కూడా ఇప్ప‌టికే తెలుగులో విడుద‌లైన సినిమానే మ‌ళ్లీ రీమేక్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ హీరోగా మూడేళ్ల కింద కార్తిక్ సుబ్బ‌రాజ్ తెర‌కెక్కించిన సినిమా జిగర్తాండ. ఈ చిత్రంలో ఈయ‌న అప్ క‌మింగ్ డైరెక్ట‌ర్ గా న‌టించాడు. ఈ సినిమా త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇందులో బాబీసింహా విల‌న్. ఈ పాత్ర‌కు నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. ఈ చిత్రంలో హీరోగా వ‌రుణ్ తేజ్ ను తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు హ‌రీష్‌. 

మ‌రోవైపు హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్న క‌న్ఫ‌ర్మ్ అయింది. ఇప్ప‌టికే క‌థ కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. అప్ప‌ట్లో జిగ‌ర్తాండ‌ను తెలుగులో చిక్క‌డు దొర‌క‌డు అంటూ డ‌బ్బింగ్ చేసారు. అయితే పెద్ద‌గా ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు ఈ క‌థ‌ను తీసుకుని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. జనవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం అంత‌రిక్షంతో పాటు ఎఫ్ 2తో బిజీగా ఉన్న వ‌రుణ్ తేజ్.. జ‌న‌వ‌రి నుంచి హ‌రీష్ సినిమాతో క‌లుస్తున్నాడు. ఇక ర‌ష్మిక కూడా ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ పూర్తైన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ సినిమాలో జాయిన్ కానుంది. మొత్తానికి చాలా సినిమాలు అనుకుని అనుకుని చివ‌రికి మ‌రోసారి రీమేక్ క‌థ ద‌గ్గ‌రే ఆగిపోయాడు హ‌రీష్ శంక‌ర్. 

More Related Stories