English   

సడెన్ గా ఏంటీ నాని

Vikram-K-Kumar
2018-12-03 14:33:09

నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. అది కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో... మొన్నటి వరకూ అల్లు అర్జున్ ను ‘మెప్పించే’ ప్రయత్నం చేసి అలసిపోయిన విక్రమ్ కుమార్ ఫైనల్ గా నాని తో ఓకే చేయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందు నాని ఇంద్రంటి మోహనకృష్ణతోసినిమా చేస్తాడు అనుకున్నారు. కానీ అనూహ్యంగా గురువుకంటే ఈ విక్రమ్ నే ఎక్కువగా నమ్మాడు నాని. అయితే ఈ కోణంలో  చూస్తే ప్రస్తుతం నాని చేస్తోన్న సినిమా అతనికి 24వది. అంటే మాగ్జిమం మైల్ స్టోన్ గా చెప్పుకునే 25వ సినిమాను గురువు ఇంద్రగంటితో చేస్తాడేమో అనుకోవచ్చు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ సడెన్ గా అనౌన్స్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు..  2019 ఫిబ్రవరి 19 నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా విక్రమ్ కుమార్ కథ చెబుతుండగా నాని టీ తాుగుతూ వింటున్నట్టుగా ఉన్న ఫోటో విడుదల చేశారు. ఇది కూడా ఆకట్టుకునేలానే ఉంది.  ఇక ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు చూసిన మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొత్తంగా నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ సినిమా నిర్మిస్తోంది అన్న అప్డేట్స్ తప్ప ఇంకేం లేదు. అంటే హీరోయిన్ తో పాటు ఇతర తారాగణం, టెక్నీషియన్స్ ఎంపిక ప్రస్తుతం నడుస్తోందన్నమాట. మరి ఇది ఎలాంటి సినిమా అనేది వేచి చూడాల్సిందే.

More Related Stories