English   

పేట్ట‌.. ఏం మాస్ సాంగ్ అనిరుధ్  బేటా.. 

Petta
2018-12-03 18:52:44

ఇప్పుడు పాట విన్న త‌ర్వాత అభిమానులు ఇదే అంటున్నారు. అస‌లు ర‌జినీకాంత్ ఏజ్ కు.. ఇమేజ్ కు సంబంధం లేకుండా ప‌క్కా మాస్ బీట్ ఒక‌టి ఇచ్చేసాడు అనిరుధ్. అందులో ర‌జినీకాంత్ డాన్సులు చేస్తాడో లేదో తెలియ‌దు కానీ ఆ పాట విన్న త‌ర్వాత అభిమానులు మాత్రం ఊరికే ఉండ‌రు. క‌చ్చితంగా థియేట‌ర్స్ లో డాన్సులు త‌ప్ప‌వు. అంత‌గా డ‌ప్పు బీట్ కొట్టేసాడు అనిరుధ్. ప‌క్కా మాస్ బీట్ తో వ‌చ్చిన మాసు మ‌ర‌ణం సాంగ్ ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తుంది. పేరుకు సంగీత ద‌ర్శ‌కుడు కానీ హీరోకు ఉండాల్సినంత ఇమేజ్ ఉంది అనిరుధ్ ర‌విచంద్ర‌కు. కుర్రాడు పాతికేళ్ల‌కే రాక్ స్టార్ అయిపోయాడు. 

ఇప్పుడు సౌత్ ఇండియాలో దేవీ శ్రీ ప్ర‌సాద్ కు స‌రైన మొగుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క అనిరుధ్ మాత్ర‌మే. త‌న డాన్సులు.. ప‌ర్ఫార్మెన్స్.. పాట‌ల‌తో ప్రేక్ష‌కులకు బాగా చేరువ‌య్యాడు అనిరుధ్. ఇప్పుడు తొలిసారి ర‌జినీకాంత్ సినిమాకు సంగీతం అందించే అవ‌కాశం అందుకున్న అనిరుధ్.. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని చేతులారా అందిపుచ్చుకున్నాడు. పేట్ట సాంగ్ విన్న త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం వ‌స్తుంది కానీ ఆస‌క్తి మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు అది పెరిగిపోయింది. 

తెలుగులోనూ ఈయ‌న స‌త్తా చూపించ‌డానికి ట్రై చేస్తున్నాడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో నాని హీరోగా వ‌స్తున్న జెర్సీ సినిమాకు అనిరుధ్ ను తీసుకున్నారు. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని క్రికెట‌ర్ గా న‌టిస్తున్నాడు. క‌థ 1980-90 మ‌ధ్య‌లో జ‌రుగుతుంది. దీనికి అనిరుధ్ అయితే సంగీతం బాగుంటుంద‌ని ఫీల్ అవుతున్నాడు ద‌ర్శ‌కుడు. అందుకే అత‌న్ని తీసుకున్నారు. ఇక నాని కూడా అనిరుధ్ తో వ‌ర్క్ చేయాల‌ని చూస్తున్నాడు. ఈ మ‌ధ్య గోపీసుంద‌ర్.. హిప్ హాప్ త‌మిళ‌న్ అంటూ ప‌క్క సంగీత ద‌ర్శ‌కుల‌కు బాగానే ఫిదా అయిపోతున్నాడు నాని. మొత్తానికి అనిరుధ్ మ‌రోసారి త‌న మాస్ ప‌వ‌ర్ చూపించాడు. 

More Related Stories