English   

క‌వ‌చం సెన్సార్ టాక్ ఏంటో తెలుసా..? 

Kavacham-Censor
2018-12-04 11:30:19

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన క‌వ‌చం చిత్ర సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ క‌వ‌చంను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. సెన్సార్ టాక్ కూడా బాగానే ఉంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్ట్ తోనే ఈ చిత్రం వ‌స్తుంది. పోలీస్ స్టోరీల‌కు స‌మానంగానే ఇందులోనూ యాక్ష‌న్ తో పాటు రొమాన్స్, కామెడీ అన్ని ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా బెల్లంకొండ అయితే న‌టుడిగా ఇంకా ఇంప్రూవ్ అయ్యాడ‌ని అంటున్నారు సెన్సార్ స‌భ్యులు. ఈ మ‌ధ్యే విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్.. ఆడియోకు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ అప్పుడే 2 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్ కూడా దాటేసింది. ఇక ఇప్పుడు విడుద‌ల కోసం చూస్తున్నాడు బెల్లంకొండ‌. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేని ఈ కుర్ర హీరోకు ఇప్పుడు క‌వ‌చం కెరీర్ కు క‌వ‌చంలా మారిపోయింది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు బెల్లంకొండ‌. ఇప్పుడు కాజ‌ల్ తో ఓ పాట విడుద‌లైంది. ఇందులో ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసి అబ్బో అనుకుంటున్నారు అంతా. అస‌లు ఏజ్ లో త‌న‌కంటే చాలా పెద్ద‌దైన కాజ‌ల్ తో చాలా ఈజీగా అల్లుకుపోయాడు బెల్లంకొండ‌. మ‌రోవైపు కాజ‌ల్ కూడా మ‌ల్లెతీగ‌లా బెల్లంకొండ వార‌సున్ని అల్లుకుపోయింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ. హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 7 అంటే ఆ రోజు ఎన్నిక‌ల రోజు.. మ‌రి పోలింగ్ డే రోజు సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు అటు వైపు చూస్తారా అనేది ఆస‌క్తిక‌ర‌మే. మ‌రి చూడాలి.. క‌వ‌చం అయినా బెల్లంకొండ కెరీర్ కు క‌వచంగా మారుతుందో లేదో..? 

More Related Stories