English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గేల‌మేస్తున్న క‌ర‌ణ్ జోహార్..

Karan-Johar
2018-12-04 11:47:50

క‌ర‌ణ్ జోహార్.. రెండేళ్ల కింది వ‌ర‌కు అయితే ఈ పేరు కేవ‌లం బాలీవుడ్ లోనే తెలిసేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదిన కూడా పాపుల‌ర్ అయ్యాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. దానికి కార‌ణం బాహుబ‌లి సినిమా. ఆ సినిమాను అక్క‌డ విడుద‌ల చేసింది.. అంత‌పెద్ద విజ‌యం సాధించ‌డంలో సాయ‌ప‌డింది కూడా ఈయ‌నే. ఇప్పుడు వ‌ర‌సగా సౌత్ సినిమాల‌పై.. ఇక్క‌డి హీరోల‌పై దృష్టిపెట్టాడు ఈయ‌న‌. తాజాగా విడుద‌లైన 2.0ను కూడా హిందీలో రిలీజ్ చేసింది క‌ర‌ణ్ జోహారే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న తెలుగులో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై క‌న్నేసాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక్క‌డ సెన్సేష‌న్స్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన ఈ కుర్రాన్ని బాలీవుడ్ ప‌ట్టుకెళ్లిపోదామ‌ని ప‌థ‌కం ప‌న్నుతున్నాడు క‌ర‌ణ్ జోహార్. మొన్న కాఫీ విత్ క‌ర‌ణ్ లో కూడా విజ‌య్ గురించి అడ‌గ్గానే చాలా విష‌యాలు చెప్పాడు క‌ర‌ణ్ జోహార్. విజ‌య్ ఒప్పుకోవాలే కానీ వెంట‌నే ఈయ‌న్ని హిందీ ఇండ‌స్ట్రీకి తీసుకెళ్ళి.. అక్క‌డ ప‌రిచ‌యం చేసేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. 

పైగా ఝాన్వీక‌పూర్ లాంటి హీరోయిన్ కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని.. ఆయ‌న‌లా మారిపోవాల‌ని ఉంద‌ని చెప్పింది. అప్ప‌ట్నుంచి బాలీవుడ్ లో మ‌నోడి పేరు బాగానే వినిపిస్తుంది. అస‌లు ఎవ‌రీ విజ‌య్ దేవ‌ర‌కొండ అంటూ అంతా గూగుల్ త‌ల్లిని అడిగేస్తున్నారు. తీరా అర్జున్ రెడ్డి సినిమా చేసిన హీరో అని తెలుసుకుని వారేవా అంటున్నారు. అక్క‌డే ఆగిపోయారు వాళ్లు.. ఇంకా మ‌నోడు చేసిన గీత‌గోవిందం.. టాక్సీవాలా కూడా చూస్తే ఇంకేమైపోతారో.. ఏదేమైనా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గోల్డెన్ టైమ్ అయితే న‌డుస్తుంది. మ‌రి దాన్ని ఇంకెన్ని ఏళ్లు ఇలాగే కాపాడుకుంటాడో చూడాలిక‌. టైమ్ కుదిర్తే ఈయ‌న కూడా బాలీవుడ్ చెక్కేద్దామ‌ని చూస్తున్నాడు. మ‌రి అది కుదిరే ప‌నేనా..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కాల‌మే చెబుతుంది. 

More Related Stories