English   

మెహ్రీన్ ను ఎందుకు తొక్కేస్తున్నారు..?

Mehreen-Pirzada
2018-12-05 10:05:40

క‌వ‌చంలో ఎంత‌మంది హీరోయిన్లు..? ఇప్పుడు అభిమానులు అడుగుతున్న ప్ర‌శ్న ఇదే. ఎందుంకంటే ఈ చిత్ర విడుద‌ల మ‌రికొన్ని గంట‌ల్లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌మోష‌న్స్ చూసినా.. ట్రైల‌ర్స్ చూసినా.. ఆడియో వేడుక‌ల్లో చూసినా కాజ‌ల్ మాత్ర‌మే క‌నిపిస్తుంది కానీ మెహ్రీన్ మాత్రం మాయం అయిపోయింది. ఎందుకు ఈ భామ బ‌య‌టికి రావ‌డం లేదు.. ద‌ర్శ‌క నిర్మాత‌లే వ‌ద్దంటున్నారా.. లేదంటే త‌నే కావాల‌ని రావ‌డం లేదా..? ఇప్పుడు క‌వ‌చం సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో అభిమానుల్లో ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. లేక‌పోతే మ‌రేంటి.. ప్ర‌తీ వేడుక‌లో కాజ‌ల్ మాత్ర‌మే క‌నిపిస్తుంది.. పైగా సినిమాలో ఈమె మాత్ర‌మే హీరోయిన్ అన్న‌ట్లు బెల్లంకొండ వార‌సుడు కూడా కాజ‌ల్ ను మాత్ర‌మే పొగిడేస్తూ థ్యాంక్సులు చెబుతున్నాడు. ఫేస్ బుక్ లైవుల‌కు కూడా ఈ ఇద్ద‌రూ వ‌స్తున్నారు కానీ మెహ్రీన్ క‌నిపించ‌డం లేదు. 

సినిమాలో క‌థ అంతా మెహ్రీన్ చుట్టూనే తిరుగుతుంద‌ని.. ఈ భామ‌ను కాపాడే కవ‌చంలా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో బెల్లంకొండ న‌టించాడ‌ని తెలుస్తుంది. మ‌రింత కీల‌క పాత్ర‌లో న‌టించిన మెహ్రీన్ ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు. కావాల‌నే ఈ భామ‌ను సైడ్ చేస్తున్నారా..? క‌చ్చితంగా కాజ‌ల్ పై ఫోక‌స్ చేసేందుకే మెహ్రీన్ ఫిర్జాదాను సైడ్ చేసార‌నే వాద‌న కూడా వినిపిస్తుంది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ మెహ్రీన్ మాత్రం త‌ను షూటింగ్ లో బిజీగా ఉండి రాలేక‌పోతున్నాన‌ని ట్వీట్ చేసింది. అయితే ఎఫ్ 2 షూటింగ్ లో ఉంటే త‌మ‌న్నా ఇక్క‌డే ఉంది క‌దా.. మ‌రి అక్క‌డ మెహ్రీన్ మాత్ర‌మే ఏం చేస్తుంది..? ఏదేమైనా ఇప్పుడు మెహ్రీన్ ప్ర‌మోష‌న్స్ కు రాక‌పోవ‌డం.. ఆమెను త‌క్కువ చేసి చూపించ‌డం వెన‌క ఏదో పెద్ద కుట్రే జ‌రుగుతుంది అంటున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు. 

More Related Stories