English   

సుబ్ర‌హ్మ‌ణ్య‌పురంను త‌క్కువ అంచ‌నా వేయొద్దండోయ్.. 

Sumanth-Subrahmanyapuram
2018-12-05 12:07:49

కొన్ని సినిమాల‌ను అస‌లు ప‌ట్టించుకోరు ప్రేక్ష‌కులు. కానీ అవి విడుద‌లైన త‌ర్వాత సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. సుమంత్ సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం కూడా ఇదే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ఈ చిత్రంపై ముందు నుంచి ఎవ‌రికీ అంచ‌నాలు కానీ.. ఆస‌క్తి కానీ లేవు. అయితే ఇప్పుడు విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ క‌చ్చితంగా ఆస‌క్తి పెరిగిపోతుంది. దాంతోపాటు పోటీ ప‌డుతున్న సినిమాల‌తో పోలిస్తే సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం త‌క్కువ అంచ‌నాల‌తోనే వ‌స్తుంది కానీ కంటెంట్ విష‌యంలో ఇదే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇది చూస్తుంటే కార్తికేయ సినిమా వ‌ద్ద‌న్నా గుర్తొస్తుంది. ట్రైల‌ర్ తోనే ఆస‌క్తి రేకెత్తించినా కూడా అదే స‌మ‌యంలో అనుమానాలు కూడా తెప్పించాడు ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌మూడి. అప్పుడే కార్తికేయ సినిమా మాదిరి అనిపించింది. గ‌తంలో సుమంత్ సినిమాల‌తో పోలిస్తే చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. 

ఇది సుమంత్ కు 25వ సినిమా కావ‌డం విశేషం. ఓ ఊరు.. ఓ గుడి.. అందులో స‌స్పెన్స్.. ఆ గుడి తెలుసుకోవాల‌నుకునే వాళ్లంతా చ‌చ్చిపోతుంటారు.. సేమ్ టూ సేమ్ కార్తికేయ క‌థ‌లో కూడా ఉంది. ఇదే క‌థ‌ను సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి సాక్షిగా తీస్తున్నాడు సుమంత్. ఇప్పుడు సుమంత్ ఏం చేస్తున్నాడో తెలియ‌దు కానీ క‌చ్చితంగా కార్తికేయ పోలిక‌లు మాత్రం బాగానే క‌నిపిస్తున్నాయి. పైగా ఇందులో హీరో పేరు కూడా కార్తిక్ కావ‌డం విశేషం. పురావ‌స్తు గుడుల గురించి తెలుసుకునే ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు సుమంత్. ఎన్నిక‌ల పోలింగ్ రోజు వ‌స్తున్న ఈ చిత్రం నెక్ట్స్ ఏంటి.. క‌వ‌చంతో పోలిస్తే కాస్త ఎడ్జ్ లోనే ఉంది. ఎందుకో తెలియ‌దు కానీ ఈ చిత్రం సైలెంట్ కిల్ల‌ర్ గా అనిపిస్తుంది. పైగా మ‌ళ్లీ రావా సినిమా త‌ర్వాత సుమంత్ సినిమా అంటే కాస్త ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఇలాంటి టైమ్ లో ఈ చిత్రం వ‌చ్చి ఏం చేస్తుందో చూడాలిక‌. 

More Related Stories