English   

యాత్ర లేదు.. అంత‌రిక్షం లేదు.. మ‌నసు ఒక్క‌టే.. 

Padi-Padi-Leche-Manasu
2018-12-05 13:48:22

డిసెంబ‌ర్ 21 వార్ గురించి చాలా రోజ‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ చివ‌రివ‌ర‌కు ఎవ‌రు రేస్ లో ఉంటారు అనేది ముఖ్యం. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వ‌స్తున్న వార్తల ప్ర‌కారం చూస్తుంటే డిసెంబ‌ర్ 21న ప‌డిప‌డి లేచె మ‌న‌సు త‌ప్ప మ‌రో సినిమా రావ‌డం లేద‌ని తెలుస్తుంది. సిజి వ‌ర్క్స్ ఆల‌స్యం కార‌ణంగా అంత‌రిక్షం.. అనివార్య కార‌ణాల‌తో యాత్ర సినిమాలు వాయిదా ప‌డుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దాంతో ప‌డిప‌డి లేచె మ‌న‌సు సోలోగా రానుంది. ముఖ్యంగా యాత్ర సినిమా వ‌స్తుంద‌ని అనుకుంటున్న వైఎస్ అబిమానుల‌కు ఇది షాకే. 2004 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న చేసిన పాద‌యాత్ర రాజ‌కీయంగా ఓ సంచ‌ల‌నం. అదే ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిని చేసింది. అప్ప‌ట్లో తండ్రి న‌మ్మిన సిద్ధాంతాల‌నే ఇప్పుడు జ‌గ‌న్ కూడా న‌డుస్తూ పాద‌యాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు త‌న‌యుడితో పాటు మ‌ళ్లీ తండ్రి పాద యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు.
 
అదే సినిమా రూపంలో.. కానీ ఎల‌క్ష‌న్ టైమ్ లో యాత్ర తీసుకొస్తే బాగుంటుంద‌ని కాస్త ఆల‌స్యంగా సినిమా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ మెగాస్టార్ మ‌మ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌కుడు. ఇక దాంతోపాటు అంత‌రిక్షం కూడా గ్రాఫిక్స్ లేట్ అవ్వ‌డంతో సినిమా రావ‌డం లేదు. దాంతో ఇప్పుడు చూపుల‌న్నీ ప‌డిప‌డి లేచె మ‌న‌సుపైనే ఉన్నాయి. ఈ చిత్రం క‌చ్చితంగా అనుకున్న టైమ్ కు రావ‌డం.. హిట్ కొట్ట‌డం ప‌క్కా అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా హ‌ను రాఘ‌వ‌పూడి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా కొట్ట‌లేక‌పోయాడు. ఈయ‌న చేసిన మూడు సినిమాలు అంచ‌నాలు అందుకోలేదు. నాని కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ యావ‌రేజ్ అంతే. దాంతో బ్లాక్ బ‌స్ట‌ర్ క‌ల ఈ చిత్రంతో తీర్చుకోవాల‌ని చూస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories