English   

ఇషా గుప్తా.. వాట్ ఏ పోజ్ బాసూ..!

Esha-Gupta
2018-12-06 15:10:32

ఇషా గుప్తా.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ల‌కు చాలా సుప‌రిచితం ఈ ముద్దుగుమ్మ‌. సినిమాలు లేక‌పోయినా కూడా అందాల‌తో ఎప్పుడూ వాళ్ల‌ను ఆహ్లాద‌ప‌రుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఇషా. ఏ హీరోయిన్ అయినా సినిమాలు చేస్తూ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఫోటోషూట్లు చేస్తుంటారు. ఇంకొంద‌రు ఫోటోషూట్లు చేస్తూ సినిమాలు చేస్తుంటారు. కానీ కొంద‌రు మాత్రం కేవ‌లం ఫోటోషూట్ల‌తోనే అవాకాశాలు సంపాదిస్తుంటారు. ఇషాగుప్తా ఈ లిస్ట్ లోకి వ‌చ్చే ముద్దుగుమ్మే. ఈమె త‌న అందాన్నంతా ధార‌పోస్తుంది. ఎంత‌లా అంటే.. బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే మ‌హాపాపం అన్న‌ట్లుంది ఈషాగుప్తా తీరు చూస్తుంటే. అరె.. ఓ ఫోటోషూట్ చేసి చూపు తిప్పుకునే లోపు మ‌రో హాట్ ఫోటోషూట్ తో మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. 

మ్యాగ‌జైన్ల‌పై ఫోజులివ్వ‌డం త‌ప్ప మ‌రే ప‌ని పెట్టుకున్న‌ట్లు క‌నిపించ ట్లేదు ఈషాగుప్తా. అడిగిందే త‌డువుగా అంద‌రికీ అందాల విందు ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ద‌మ్ముంటే కాస్కోండి అంటూ రెచ్చిపోతుంది. కొన్ని రోజుల నుంచి ఈమె చేస్తోన్న ర‌చ్చకు సోష‌ల్ మీడియా అంతా వేడెక్కిపోతుంది. తాజాగా మ‌రోసారి అలాంటి అందాలే ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. ఏంటి అంత‌లా రెచ్చిపోతున్నావ్ అని అడిగితే అంతా నా యిష్టం అంటుంది. నా అందాలు చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారా అంటూ రివ‌ర్స్ అటాక్ చేస్తుంది. తాజాగా మ‌రోసారి హాట్ హాట్ అందాలతో స్క్రీన్ ను షేక్ చేసింది ఈ భామ‌. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని హీట్ ఎక్కించింది ఈ భామ‌. ఆ మ‌ధ్య తెలుగులో వీడెవ‌డు సినిమాలో న‌టించింది ఈషాగుప్తా. అవ‌కాశం వ‌స్తే తెలుగులోనూ త‌న స‌త్తా చూపిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈమె సెగ‌లు ఎప్ప‌టికి త‌గ్గేనో చూడాలిక‌..!  

More Related Stories