English   

ఎన్టీఆర్ లుక్ మార్చి ఓటేశాడు..!!

Jr-NTR
2018-12-07 10:49:36

రాజమౌళి సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ వంద కిలోల బరువు పెరిగాడు !ఈ సినిమా కోసం గెటప్ నే మార్చేశాడు ! ఎవరూ గుర్తు పట్టలేనంతగా ఆయన తన ఆహార్యాన్ని మార్చేశాడు ! గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలివి. కానీ ఇవన్నీ తప్పని తేలిపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ మామూలుగానే ఉన్నాడు. ఈ ఉదయం తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో కలసి జూబ్లీహిల్స్ లోని జూబ్లీహిల్స్‌‌లోని ఓబుల్ రెడ్డి స్కూలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. క్యూలైన్‌లో అడిగిన వారికి సెల్ఫీలిస్తూ తారక్ ఓటుహక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పోలింగ్ బూత్ నకు వచ్చిన ఆయన ఓటేసేందుకు సుమారు 40 నిమిషాల పాటు క్యూలైన్లో వేచి చూసి, ఆపై ఓటేశాడు.  ఓటేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. "రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. ఓటు వేయకుంటే కంప్లయింట్ చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే. అక్క గెలవాలని మాత్రం కోరుకుంటున్నా" అని ఆయన అన్నారు. చాలా రోజుల తరువాత జూనియర్ ఎన్టీఆర్ బయట కనిపించడంతో మీడియా కెమెరాలు ఆయన ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డాయి.

More Related Stories