English   

కేసీఆర్‌..కేటీఆర్‌ పై చెలరేగిన శ్రీరెడ్డి

Sri-Reddy
2018-12-07 19:01:45

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెట్టింది. తన పోరాటం సమయంలో కీసేఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన ఆమె తాజాగా టీఆర్ఎస్‌ను టార్గెట్ గా చేసుకుంది. ఇదే సమయంలో మహాకూటమికి ఓటేయాలని తన ఫాలోవర్లను కోరింది. టీఆర్ఎస్‌కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందన్న ఆమె డిక్టేకర్‌కు లేదా హిట్లర్‌కు ఓటేయ్యొద్దంటూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. మెరుగైన తెలంగాణ కోసం మీ ఓటును వినియోగించాలని సూచించింది. పిల్లల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించండి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు, జై తెలంగాణ అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టింది. ఆడవాళ్లు లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్ర పట్టదు. కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదు. నిద్రపోతున్న తెలంగాణ మేలుకో అని శ్రీ రెడ్డి మరో ఘాటు పోస్ట్ చేసింది. మొత్తానికి టీఆర్ఎస్ సర్కార్ తన ఆవేదనను పట్టించుకోలేదన్న కసి ఆమెలో ఉందని అందుకే అప్పుడు మహాత్ముడిలా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు దుర్మర్గుడులా కనిపిస్తున్నాడని కేసీఆర్ అభిమానులు అంటున్నారు. 

More Related Stories