English   

 ఆస్తులు రాయించుకుంటున్న సునీల్.. 

Sunil
2018-12-08 08:06:26

ప‌దేళ్ళ త‌ర్వాత అమ్మాయి పుట్టింటికి వ‌స్తే ఎలా ఆహ్వానిస్తారు.. ఇప్పుడు సునీల్ ను కూడా మ‌న ద‌ర్శ‌కులు అలాగే ఆహ్వానిస్తున్నారు. ఆ మ‌ధ్య హీరోగా సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్ అయ్యాడు. ఇప్ప‌టికే వ‌ర‌స‌గా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్ప‌టికే ఈ ఏడాది మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి కూడా. అర‌వింద స‌మేత‌.. సిల్లీఫెలోస్.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీల్లో క‌మెడియ‌న్ గా క‌నిపించాడు సునీల్. హీరోగా ఇక చాలు అనుకుంటున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. దేన్నైనా తెగేవ‌ర‌కు లాగ‌కూడ‌దు. ఇప్పుడు సునీల్ చేస్తున్న‌ది కూడా ఇదే. ఇక నువ్వాప‌రా బాబూ అనేవ‌ర‌కు తెచ్చుకుంటే.. క‌మెడియ‌న్ గా చేసినా కూడా చూడ‌రు. అందుకే ముందు జాగ్ర‌త్త‌తో అవి మానేసి కామెడీ వైపు అడుగేసాడు. ఈయ‌న సెకండ్ ఇన్నింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు నిరాశాజ‌న‌కంగానే ఉంది. ఒక్క హిట్ కూడా రాలేదు.. పైగా చేసిన కారెక్ట‌ర్లు కూడా పేల‌లేదు. అయితే ఇప్పుడు క‌మెడియ‌న్ గా ఉన్నా కూడా మ‌ళ్లీ హీరో కావాల‌ని చూస్తున్నాడు సునీల్. రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ వెలిగొండ శ్రీ‌నివాస్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సునీల్ హీరోగా న‌టించ‌డానికి ఓకే అన్నాడ‌ని తెలుస్తుంది. కానీ రెమ్యున‌రేష‌న్ తోనే చుక్క‌లు చూపించాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రోజుకు క‌నీసం 4 ల‌క్ష‌ల వ‌ర‌కు సునీల్ కి స‌మ‌ర్పించుకుంటున్నారు నిర్మాత‌లు. క‌మెడియ‌న్ గా ఆస్తులు రాయించుకుంటున్నా హీరోగా చేయ‌మంటే ఏకంగా కోటిన్న‌ర అడిగాడ‌ని తెలుస్తుంది ఈ క‌మెడియ‌న్. ఈయ‌న రేట్ తెలిసి నిర్మాత‌ల‌కు కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేస్తుంది. దాంతో క‌థ న‌చ్చింది కానీ మ‌ళ్లీ హీరోగా న‌టిస్తాడా లేదా అనేది మాత్రం ఆస‌క్తికరంగా మారింది. 

More Related Stories