English   

బెల్లంకొండ‌.. క‌వ‌చం కూడా గుదిబండేగా..!

Kavacham
2018-12-08 08:49:10

ఒక్కటి.. ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా లేకుండా నాలుగేళ్లుగా నిలిగిపోతున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. వ‌ర‌స‌గా అగ్ర ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా.. స్టార్ హీరోయిన్ల‌తో చిందేసినా కూడా ఈ కుర్రాడి జాతకం మాత్రం మార‌డం లేదు. అవేం లేకుండా సింపుల్ గా కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ తో క‌వ‌చం అంటూ వ‌చ్చినా కూడా ఇప్పుడు కూడా కాలం క‌లిసిరాన‌ట్లే క‌నిపిస్తుంది. క‌వ‌చంకు కూడా టాక్ తేడాగా వ‌చ్చేసింది. ఈ సినిమా కూడా హిట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌తీసారి టాక్ బాగా వ‌చ్చి.. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచేవి బెల్లంకొండ సినిమాలు. కానీ ఇప్పుడు మాత్రం తొలిరోజే టాక్ కూడా తేడా వ‌చ్చేసింది. రొటీన్ క‌థ‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడంటున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా ఎందుకు ఇంత పాత క‌థ‌లు బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓకే చెబుతున్నాడంటూ ఆయ‌న్ని అడుగుతున్నారు అభిమానులు. క‌నీసం కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా అనుకున్న‌పుడు కొత్త క‌థ ఉండాలి క‌దా.. మ‌ళ్లీ అదే రొటీన్ క‌థ‌తో ఎందుకు రావ‌డం అంటున్నారు. కిడ్నాప్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఒక్క‌టి కూడా ఆక‌ట్టుకునే అంశం లేద‌ని తేల్చేసారు. దాంతో మ‌రోసారి బెల్లం బాబుకు నిరాశ త‌ప్పేలా లేదు. ప్ర‌తీసారి ఇదే జ‌రుగుతుంది.. ఈ సారి తొలిరోజే అది జ‌రిగింది. మ‌రి ఈ బాబు హిట్ కోరిక తీర్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..? 

More Related Stories