English   

సంక్రాంతికి విజ‌య్-అట్లీ కాంబినేష‌న్.. 

Vijay
2018-12-08 09:10:19

విజ‌య్ సినిమా అంటే ఇదివ‌ర‌కు త‌మిళ‌నాట మాత్ర‌మే ఇమేజ్ ఉండేది.. అంచ‌నాలు ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగులో కూడా విజ‌య్ మార్కెట్ పెరిగిపోయింది. ఈయ‌న సినిమాలు ఇక్క‌డ వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాయి. మెర్స‌ల్ తెలుగు వ‌ర్ష‌న్ అదిరిందితో తొలి విజ‌యాన్ని అందుకున్న విజ‌య్.. మొన్నీమ‌ధ్యే స‌ర్కార్ తో మ‌రో హిట్ కొట్టాడు. ఈ చిత్రం ఏకంగా 9 కోట్ల షేర్ తీసుకురావ‌డంతో విజ‌య్ గాల్లో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న సినిమాపై తెలుగులో కూడా అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. పైగా ఈయ‌న ఎంచుకుంటున్న క‌థ‌లు కూడా అలాగే ఉంటున్నాయి. సామాజిక అంశాల‌నే త‌న సినిమాలో క‌థ‌లుగా తీసుకుంటున్నాడు విజ‌య్. వివాదాస్ప‌దంగా ఉన్నా ప‌ర్లేదు కానీ కాస్త బ‌లంగానే అర్థ‌మ‌య్యేలా త‌న సినిమాల‌తో చూపిస్తున్నాడు. క‌త్తి అయినా.. తుపాకి అయినా.. మెర్స‌ల్ అయినా.. మొన్నటి స‌ర్కార్ అయినా అన్నీ అలాంటి సినిమాలే. ఇప్పుడు అట్లీకుమార్ తో మూడోసారి సినిమా చేయ‌బోతున్నాడు విజ‌య్. ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా సంక్రాంతికే మొద‌లు కానుంది. అదే రోజు రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీపావ‌ళికి సినిమా వ‌స్తుంద‌ని అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు నిర్మాత‌లు. ఈ కాంబినేష‌న్ లో రెండేళ్ల కింద తెరీ.. గతేడాది మెర్స‌ల్ సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు ఈ జోడి. మ‌రి ఈ సారి ఎలాంటి స‌బ్జెక్ట్ తో వ‌స్తారో చూడాలిక‌. 

More Related Stories