English   

ఎన్టీఆర్ డుమ్మా కొట్టడానికి కారణం బాలయ్య నా ?

NTR
2018-12-08 12:02:09

మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న టీడీపీ నేత నందమూరి సుహాసిని తరుపున నందమూరి కుటుంబం నుండి పలువులు ప్రచారంలో పాల్గొన్నారు. నందమూరి తారక్ రత్న, నందమూరి జానకిరామ్ సతీమణి, బాలకృష్ణ తదితరులు రోడ్ షో లో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి కారణం బాలయ్య అని తెలుస్తోంది. నీకు సినిమాల మీద మాత్రమే ఆసక్తి ఉంటే రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు , నీ కెరీర్ చూసుకో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడట. జీవితంలో రాజకీయాలు వేరు, సినిమాలు వేరు ఈ విషయాన్ని నేను మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి వద్ద నుండి నేర్చుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాదానికి ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే కొంతమంది వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారట. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు కాబట్టే ఆ భయంతోనే నేను జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి రావద్దు అన్నానని బాలకృష్ణ చాలా వివరంగా పరిస్థితిని సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చారట. ఈ విషయం రెండ్రోజుల నుండీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

More Related Stories