English   

ఫాన్సీ రేట్ కు 'ఎన్జీకే' ఆడియో హక్కులు

suriya-NGK
2018-12-08 12:24:57

సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య మొట్టమొదటిసారిగా నటిస్తున్న చిత్రం ‘ఎన్‌జీకే’. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సాయిపల్లవిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం దీపావళికే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై అభిమానులలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీపావళి సందర్భంగా సూర్యకి సంబంధించి స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో సూర్య లుక్ అభిమానులని ఆకట్టుకుంది.  యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి అందిస్తున్న సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను భారీ రేటుకు సోనీ మ్యూజిక్ సౌత్ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమాపై సూర్య గట్టి ఆశలే పెట్టుకున్నాడని అంటున్నారు. సూర్య ఆశించే హిట్ ఈ సినిమాతో దొరుకుతుందనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories