English   

తన మేనేజర్ మీద కేసు పెట్టిన హాట్ భామ !

Zareen-Khan
2018-12-08 08:11:32

సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జరీన్ ఖాన్ తాజాగా ఓ వివాదంతో మరోమారు వార్తలోకి వచ్చింది. అదేంటంటే తన పేరుచెడగొట్టే విధంగా ప్రవర్తిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ మేనేజర్ అంజలి మీద ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ మీడియా వివరాల ప్రకారం జరీన్ ఖాన్ మీద కక్షపెంచుకున్న మాజీ మేనేజర్ అంజలి ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. జరీన్ అంజలి ని తన మేనేజర్ గా పెట్టుకుంది . ఇద్దరి మధ్య తేడాలు రావడంతో తన మేనేజర్ గా అంజలిని తొలగించింది జరీన్ ఖాన్ . అయితే అంజలి మాత్రం జరీన్ ఖాన్ మేనేజర్ నేనే చెప్పుకుంటూ కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుందట దాంతో ఈ విషయం జరీన్ ఖాన్ కు తెలిసి అంజలి ని నిలదీస్తే అసభ్యకరమైన మెసేజ్ లను పెడుతూ జరీన్ ని బ్లాక్ మెయిల్ చేస్తోందట. దీంతో మాజీ మేనేజర్ అంజలి పంపిన అభ్యంతరకర సందేశాలు ఆధారాలుగా చూపుతూ జరీన్ ఖాన్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అంజలి మీద పోలీసులు ఐపిసి సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 2010లో సల్మాన్ హీరోగా రూపొందిన ‘వీర్' సినిమా ద్వారా పరిచయమైన జరీన్ ఖాన్ ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ బాలీవుడ్లో నటిగా నిలదొక్కుకున్నారు. అనుకున్న స్థాయిలో స్టార్ డం పొందలేదు కానీ హాట్ ఇమేజ్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది జరీన్ ఖాన్ 1921 చిత్రంలో నటించారు. 

More Related Stories