English   

రెబల్ స్టార్‌ తో రాకింగ్ స్టార్...పండుగ చేస్తున్నారుగా ?

Prabhas
2018-12-08 16:50:30

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కి ఫాలోయింగ్ రేంజ్‌ మారిపోయింది. దేశ విదేశాల్లో సైతం ఆయనకు అభిమానులు పెరిగిపోయారు. దీంతో ఆయన నటిస్తున్న ‘సాహో’ మూవీ మార్కెట్ తన పరిధిని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ సింగ్ భారీ హంగులతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా, మందిరా బేడి, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ తదితరులు బాలీవుడ్ దిగ్గజాలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చారు. కళ్లకు లైట్ ఎల్లో కలర్ గ్లాస్‌లు పెట్టి లైట్ రిప్డ్ జీన్స్ అండ్ టీషర్ట్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఈ లుక్ ఎక్కడ కెమెరా కంట పడింది అంటే కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్’ మూవీ ప్రమోషన్స్‌ కోసం ముంబైకి వెళ్లారు. అక్కడే ప్రభాస్ ఉన్నారని తెలుసుకుని ప్రభాస్‌ని డిన్నర్‌కి ఆహ్వానించడంతో ఆయన కూడా వచ్చాడు అనుకోకుండా జరిగిన ఈ డిన్నర్ లో యష్‌తో కలిసి సందడి చేశారు ప్రభాస్. రెబల్ స్టార్ ఒకపైపు రాక్ స్టార్ ఒకవైపు స్టైలిష్ లుక్‌లతో దర్శనం ఇవ్వడంతో ఈ పిక్ అటు శాండిల్ ఉడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ వైరల్‌గా మారింది. ఇక ఇద్దరికీ అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా, ఈ దెబ్బకు వారంతా డబుల్ కా మీటా ఆఫర్ అనుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

More Related Stories