English   

పవన్ ని ఓడిస్తా...శ్రీరెడ్డి శపధం !

Sri-Reddy
2018-12-08 19:27:38

క్యాస్టింగ్ కోచ్ అంటూ ఒక ఉద్యమాన్నే నడిపిన శ్రీ రెడ్డి తర్వాత తర్వాత సినిమా అవకాశాలు రావడం వలన సైలెంట్ అయిపొయింది. అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల తరువాత లైవ్‌లోకి వచ్చి కారును తొక్కేయండి కూటమిని గెలిపించండి అంటూ కేసీఆర్, కేటీఆర్‌ల పై మందు, పొందు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తన ప్రియ శత్రువు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కి సవాల్ విసిరింది. గతంలో పవన్ మీద శాపనార్ధాలు, ఆయన తల్లిని దూషించినట్టుగా వ్యాఖ్యలు చేసిన  శ్రీరెడ్డి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌ను, జనసైనికుల్ని రెచ్చిగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ ‘ఎవర్నీ వదిలిపెట్టేది లేదు నా శపథం నెరవేరకుండా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్‌కి ఇంకా టైమ్ ఉంది. ఆయన నిలబడ్డ ప్లేస్‌లో ఓడగొడతా. ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తే అదే ప్లేస్‌లో ఓడిస్తా’ అంటూ శ్రీ రెడ్డి శపథం చేసింది. 
 

More Related Stories