English   

రష్మి...ఈవెంట్ రచ్చ...ఏమవునో ?

Rashmi
2018-12-08 20:06:40

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ - రష్మీల జోడీ ఎంతో పాప్యులర్ అయింది. ఈ క్రేజ్ కారణంగానే ఈ ఇద్దరూ మరికొన్ని షోలలోను సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి తిరుపతిలో ప్రత్యక్షమైంది. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి గాను, తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన 10k రన్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ - రష్మీ పాల్గొననున్నట్టు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై స్పందించిన రష్మీ "ఈ ఈవెంట్ కి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ ఇంతవరకూ నన్ను సంప్రదించలేదని ఈ ఈవెంట్ కి నేను రానున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నా అనుమతి లేకుండా నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు? నిర్వాహకులు వెంటనే నా ఫ్లెక్సీని తొలగించాలని అంటూ ఆమె సోషల్ మీడియా పేర్కొంది.

అయితే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చారు. ‘ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మేం ఆమెకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. ఆమె రావడానికి ఒప్పుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు మా కార్యక్రమాన్ని కొత్తగా చూస్తున్నట్టు చెబుతున్నారు, నేను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపా, ఆధారాలు కూడా ఉన్నాయి చూడండి. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అంటూ కొన్ని స్క్రీన్‌ షాట్లు షేర్ చేశారు. దీంతో తిరిగి ఆయన మాటలకు రష్మి ప్రతిస్పందించారు. ఏదైనా చెప్పేముందు కాస్త నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధాలుగా తేలుతాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అలానే చేయండని ఆమె పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే వారు పర్సనల్ గా తేల్చుకోవాల్సిన విషయాలు ఇలా బట్టబయలు చేయడంతో ఎవరికీ ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.


 

More Related Stories