English   

చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్..

jr ntr given shock to chandrababu naidu
2018-12-20 21:05:33

అస‌లే ఎన్నిక‌ల్లో ఓడిపోయి బాధ ప‌డుతున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న ప‌నులు పుండు మీద కారం చల్లిన‌ట్లు అనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించి కేసీఆర్ త‌న విజ‌య బావుటా ఎగ‌ర‌వేసాడు. ఈ ఎన్నికల్లో మహాకూటమి కాస్తైనా ప‌రువు కాపాడుకుని ఉండుంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది కానీ తెలుగుదేశం దారుణంగా ఫ్లాప్ అవ‌డంతో అస‌లుకే ఎస‌రొచ్చింది. దీనికి ఇప్పుడు చాలా కార‌ణాలు కూడా ఉన్నాయి. అయితే కూట‌మి ఓట‌మిలో బాబుది చిన్న పాత్రే అయినా.. ఆయ‌న‌తో పొత్తు పెట్టుకున్నందుకే అంత దారుణం అని అంతా ఆడిపోసుకుంటున్నారు.
ఇక టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన కూక‌ట్ ప‌ల్లి సీట్ కూడా దారుణంగా ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌భావం ఇప్పుడు ఏపీలో కూడా ప‌డుతుంద‌నే భావిస్తున్నారు విశ్లేష‌కులు. అక్క‌డ కానీ టీడీపీ మ‌రికొంత క‌ష్ట‌ప‌డి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అంతా అనుకుంటున్నారు. అదే స‌మ‌యంలో కేటీఆర్ మాత్రం త‌న వ‌ర్గాన్ని గట్టిగా ప్రచారం చేసి గెలిపించుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ తో క‌లిసి పార్టీకి వెళ్ళాడు ఎన్టీఆర్. దాంతో ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. చంద్రబాబునాయుడు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఎన్టీఆర్ ఇలా చేయ‌డాన్ని అభిమానులు కూడా హ‌ర్ట్ అవుతున్నారు.

More Related Stories