English   

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి ప‌డిప‌డి లేచె మ‌న‌సు ఫ‌స్ట్ టాక్..

Sharwanand and Sai Pallavi's  movie Padi Padi Leche Manasu first talk
2018-12-21 00:36:21

ప‌డిప‌డి లేచె మ‌న‌సు సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచ‌నాలున్నాయి. హ‌ను రాఘ‌వ‌పూడి మేకింగ్.. సాయిప‌ల్ల‌వి, శ‌ర్వానంద్ న‌ట‌న‌తో ఈ సినిమా క‌చ్చితంగా మ‌రో స్థాయిలో ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు కూడా ఊహిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్లుగానే పాట‌లు కూడా అద్భుతంగా ఉన్నాయి. విజువ‌ల్ ట్రీట్ బాగుంది. ఇక ఇప్పుడు సినిమా కూడా విడుద‌లైంది. యుఎస్ టాక్ ప్ర‌కారం సినిమాకు మంచి టాకే వ‌చ్చింది కానీ చాలా స్లోగా సాగ‌డం ఒక్క‌టే ఈ చిత్రానికి మైన‌స్ అంటున్నారు. అద్భుత‌మైన విజువ‌ల్స్ ఉన్నా కూడా అక్క‌డ‌క్క‌డా మ‌రీ నెమ్మ‌దిగా సాగింది ఈ చిత్రం అంటున్నారు ఆడియ‌న్స్. ముఖ్యంగా కీల‌క‌మైన సెకండాఫ్ చాలా నెమ్మ‌దించింది అనేది వాళ్ల వాద‌న‌. అయితే శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి సీన్స్ మాత్రం అదిరిపోయాన‌ని.. వాళ్లు క‌నిపించిన ప్ర‌తీ సీన్ అద్భుతంగా ఉంద‌ని చెబుతున్నారు ఓవ‌ర్సీస్ ఆడియన్స్. క‌చ్చితంగా ఈ చిత్రం వాళ్ల కెరీర్లో మ‌రో మంచి సినిమా అవుతుంద‌నేది క‌నిపిస్తుంది. కానీ సినిమా విజ‌యావ‌కాశాలు మాత్రం ఎలా ఉన్నాయనేది తేల‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఫ‌స్టాఫ్ ఎంట‌ర్టైనింగ్ గానే సాగినా.. ఇంట‌ర్వెల్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి గాడి త‌ప్పింద‌ని.. ఆ త‌ర్వాత సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయింద‌నేది వినిపిస్తున్న వార్త‌లు. మ‌రి చూడాలిక‌.. ఇండియాలో ఎలాంటి టాక్ తో ప‌డిప‌డి లేచె మ‌న‌సు ఓపెన్ అవుతుందో...?

More Related Stories