English   

వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం సినిమా ఫ‌స్ట్ టాక్..

Varun Tej's 'Antariksham 9000 KMPH movie first talk
2018-12-21 07:48:31

వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా సంక‌ల్ప్ తెర‌కెక్కించిన సినిమా అంత‌రిక్షం. ఎంతో ఆస‌క్తి మ‌ధ్య ఈ చిత్రం విడుద‌లైంది. స్పేస్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత కూడా వాటిని నిల‌బెట్టే దిశ‌గానే సినిమా వెళ్తుందంటున్నారు అభిమానులు. యుఎస్ లో డిసెంబ‌ర్ 20 రాత్రే ఈ చిత్ర షోలు ప‌డిపోయాయి. అక్క‌డ్నుంచి వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం సినిమా టార్గెటెడ్ ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అవుతుందంటున్నారు. ఘాజీ రేంజ్ లో యూనివ‌ర్స‌ల్ టాక్ కాక‌పోయినా ఇది కూడా చాలా బాగా తీసాడు సంక‌ల్ప్ అనే టాక్ అయితే వ‌చ్చింది. కాక‌పోతే నెమ్మ‌దిగా సాగ‌డం ఒక్క‌టే అంత‌రిక్షంకు మైన‌స్ అంటున్నారు. కానీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాత్రం అదిరిపోయాయ‌ని.. క‌చ్చితంగా ఈ చిత్రం విభిన్న‌మైన సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వాళ్ల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. క‌చ్చితంగా ఈ చిత్రంతో వ‌రుణ్ తేజ్ హ్యాట్రిక్ కొడ‌తాడ‌ని ధీమాగానే చెబుతున్నారు ఆడియ‌న్స్. స్పేస్ లోకి వెళ్లిన త‌ర్వాత వ‌చ్చే సీన్లు అన్నీ అద్బుతంగా ఉన్నాయ‌ని.. అక్క‌డ జ‌రిగే స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు చాలా బాగా రాసుకున్నాడ‌ని చెబుతున్నారు ఆడియ‌న్స్. మ‌రి చూడాలిక‌.. అంత‌రిక్షం 9000 కేఎంపిహెచ్ ఇక్క‌డ ఎలాంటి టాక్ తో ఓపెన్ కానుందో..?

More Related Stories